యిర్మీయా 8:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు. అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు. నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి. కాని వారు సిగ్గుపడనే లేదు. వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు. అందరితో పాటు వారూ శిక్షించబడతారు. నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’” ఇది యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు, అని యెహోవా చెప్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు, అని యెహోవా చెప్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది. దాసులకు జరిగినట్టు యజమానులకు జరుగుతుంది. దాసీలకు జరిగినట్టు వారి యజమానురాళ్లకు జరుగుతుంది. కొనేవారికి జరిగినట్టు అమ్మేవారికి జరుగుతుంది. అప్పిచ్చే వారికి జరిగినట్టు అప్పు పుచ్చుకొనే వారికి జరుగుతుంది. వడ్డీకి ఇచ్చేవారికి జరిగినట్టు వడ్డీకి తీసుకునేవారికి జరుగుతుంది.