Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 7:25 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 మీపితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 మీ పూర్వీకులు ఈజిప్టును వదలిన నాటినుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపియున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్లు పంపాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 7:25
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.


వారి పూర్వీకుల దేవుడైన యెహోవా తన ప్రజల మీదా, తన నివాస స్థలం మీదా జాలి పడి వారి దగ్గరికి తన రాయబారులతో సందేశాలు పంపిస్తూ వచ్చాడు.


మా పూర్వీకులతో మొదలు ఇప్పటివరకూ మేమంతా ఘోరమైన అపరాధాలు చేస్తూ వచ్చాం. మేము చేసిన దోషాలను బట్టి ఈ రోజు ఉన్నట్టుగా మేమూ, మా రాజులూ, యాజకులూ అన్యదేశపు రాజుల స్వాధీనంలో, చావుకూ చెరకూ దోపిడీకీ గురై ఉండడం వలన ఎంతో అవమానభారంతో సిగ్గుపడుతూ ఉన్నాం.


వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు.


నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్ట లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు.


నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరి ఇంకా ఏమి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాస్తుందని నేను ఎదురు చూస్తే అది పిచ్చి ద్రాక్షలు ఎందుకు కాసింది?


ఐగుప్తులో నుండి మీ పూర్వికులను రప్పించిన రోజు మొదలుకుని నేటివరకూ వారితో ‘నా మాట వినండి’ అని నేను గట్టిగా, ఖండితంగా చెబుతూ వచ్చాను.


“ఆమోను కొడుకు యూదా రాజు యోషీయా పాలించిన 13 వ సంవత్సరం మొదలు నేటివరకూ ఈ 23 సంవత్సరాలు యెహోవా నాకు సందేశం ఇస్తూ ఉన్నాడు. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ మీరు పెడచెవిన పెట్టారు.


యెహోవా మీ దగ్గరికి తన సేవకులైన ప్రవక్తలను పంపించాడు. మీరు వారి మాట వినలేదు, వారిపట్ల శ్రద్ధ చూపలేదు.


ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,’ ఇది యెహోవా వాక్కు. ‘నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు’ ఇది యెహోవా వాక్కు.”


‘ద్రాక్షారసం తాగొద్దు,’ అని రేకాబు కొడుకు యెహోనాదాబు తన కొడుకులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి, ఈ రోజు వరకూ తమ పితరుడి ఆజ్ఞకు విధేయులై వాళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు. కాని, నేను ఉదయాన్నే లేచి మీతో ఎంతో శ్రద్ధగా మాట్లాడినా, మీరు నా మాట వినరు.


ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, ‘ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి’ అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు.


అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.


నేను మీతో పదే పదే మాట్లాడినా మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరు జవాబు చెప్పకుండా మీరు ఈ పనులన్నీ చేశారు.


ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.


నా నుండి తిరిగిపోవాలని నా ప్రజలు తీర్మానం చేసుకున్నారు. మహోన్నతుడినైన నాకు మొర పెట్టినా ఎవడూ నన్ను ఘనపరచడు.


ప్రవక్తలతో నేను మాటలాడాను. విస్తారమైన దర్శనాలు నేనిచ్చాను. ఉపమానరీతిగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాను.


మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను. మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?” యెహోవా వెల్లడించేది ఇదే.


మీ పూర్వీకుల కాలం నుండి మీరు నా నియమాలను లక్ష్యపెట్టకుండా వాటిని తిరస్కరించారు. అయితే ఇప్పుడు మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీవైపు తిరుగుతానని సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పినప్పుడు, ‘మేము దేని విషయంలో తిరగాలి?’ అని మీరు అంటారు.


వారు కొంత మందిని చంపుతారు. కొంతమందిని హింసిస్తారు.’


ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ