Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 6:29 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 కొలిమి తిత్తులు మంటల్లో కాలిపోతున్నాయి. ఆ జ్వాలల్లో సీసం తగలబడి పోతున్నది. అలా మండిస్తూ ఉండడం నిష్ప్రయోజనం. దుష్టులను వేరు చేయడం వీలు కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు. కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది. కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది! శుద్ద వెండిని చేయాలనుకోవటం వృధా ప్రయాస. వృధా కాలయాపన. అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 6:29
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే.


నేను వ్యర్థంగా కష్టపడి, నిష్ఫలంగా నా శక్తినంతా ఖర్చుచేశానని అనుకున్నా, నా న్యాయం యెహోవా దగ్గరే ఉంది. నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది.


అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. “యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు.


కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?


అలసట పుట్టే వరకూ ఇంతగా శ్రమించినా, అగ్నిలో కాల్చినా, దానిలో నుంచి ఆ తుప్పు పోలేదు.


నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.


నా నుండి తిరిగిపోవాలని నా ప్రజలు తీర్మానం చేసుకున్నారు. మహోన్నతుడినైన నాకు మొర పెట్టినా ఎవడూ నన్ను ఘనపరచడు.


ఆ మూడవ భాగాన్ని నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుభ్రపరచినట్టు శుద్ధి చేస్తాను. బంగారాన్ని పరీక్షించినట్టు వారిని పరీక్షిస్తాను. వారు నా నామాన్నిబట్టి మొరపెట్టినప్పుడు నేను వారి మొర ఆలకిస్తాను. “వీరు నా ప్రజలు” అని నేనంటాను. “యెహోవా మా దేవుడు” అని వారు అంటారు.


నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది.


ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.


అతడు ఆ నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో రెండు వందలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. ఆ విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ