Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 52:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అతని పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదోనెల్లో పదో రోజున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. వాళ్ళు యెరూషలేముకు ఎదురుగా శిబిరం వేసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవదినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగి నప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవత్సరాల పది నెలలు దాటి పదవ రోజు గడుస్తూ వుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సైన్యం యెరూషలేము బయట దిగింది. తరువాత వారు నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ దిమ్మలు కట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 కాబట్టి సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ రోజున, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి బయలుదేరాడు. వారు పట్టణం బయట శిబిరం వేసుకుని దాని చుట్టూ ముట్టడి దిబ్బలు నిర్మించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 కాబట్టి సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ రోజున, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి బయలుదేరాడు. వారు పట్టణం బయట శిబిరం వేసుకుని దాని చుట్టూ ముట్టడి దిబ్బలు నిర్మించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 52:4
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నీకు విరోధంగా నీ చుట్టూ శిబిరం కడతాను. నీకు ఎదురుగా కోట కడతాను. ముట్టడి వేస్తాను. నీకు విరోధంగా ముట్టడి పనులను అధికం చేస్తాను.


“బబులోను రాజు నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు. అతడు మనలను విడిచి వెళ్లిపోయేలా యెహోవా తన అద్భుత క్రియలన్నిటిని మన పట్ల జరిగిస్తాడేమో దయచేసి మా కోసం యెహోవా దగ్గర విచారణ చేయండి” అని చెప్పడానికి యిర్మీయా దగ్గరికి వారిని పంపించాడు. అప్పుడు యెహోవా దగ్గరనుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.


చూడు! పట్టణాన్ని స్వాధీనం చేసుకోడానికి ముట్టడి దిబ్బలు పైపైకి లేస్తున్నాయి. ఖడ్గం, కరువు, తెగులు రావడం వల్ల దాని మీద యుద్ధం చేసే కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించడం జరిగింది. నువ్వు ఏం చెప్పావో అది జరుగుతూ ఉంది. జరుగుతున్నది నువ్వు చూస్తున్నావు.


బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యం అంతా, అతని అధికారం కింద ఉన్న భూరాజ్యాలు, ప్రజలు, అందరూ కలిసి యెరూషలేము మీద, దాని ప్రాంతాలన్నిటి మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు.


యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.


యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.


అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు.


యెరూషలేము ఎదుట ద్వారాలను పడగొట్టే పరికరాలు సిద్ధం చెయ్యమనీ, ఊచ కోత ఆరంభించమనీ, యుద్ధధ్వని చెయ్యమనీ, ముట్టడి దిబ్బలు కట్టమనీ అడుగుతున్నాడు. యెరూషలేముగూర్చి తన కుడివైపు శకునం కనిపించింది!


నేను అంతటినీ శిథిలం చేస్తాను! శిథిలం చేస్తాను! ఆ కిరీటం ఇంక ఉనికిలో ఉండదు. దానికి రాజుగా ఉండే అసలైన హక్కు ఉన్నవాడు వచ్చే వరకూ అది కనిపించదు. అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.”


అతడు బయటి పొలాల్లోని నీ కూతుళ్ళను కత్తి పాలు చేస్తాడు. నీ కెదురుగా బురుజులు కట్టించి మట్టి దిబ్బలు వేయించి నీ కెదురుగా డాళ్ళను ఎత్తుతాడు.


మనం చెరలోకి వచ్చిన పన్నెండవ సంవత్సరం పదో నెల అయిదో రోజు ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా దగ్గరికి వచ్చి “పట్టణాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు.


మనం బబులోను చెరలోకి వచ్చిన 25 వ సంవత్సరం మొదటి నెల పదో రోజున, అంటే పట్టణం ఆక్రమణకు గురైన 14 వ సంవత్సరం అదే రోజు యెహోవా హస్తం నా మీదకి వచ్చి నన్ను పట్టణానికి తోడుకు పోయాడు.


మీ మీదికి కత్తి రప్పిస్తాను. అది నా నిబంధన విషయం ప్రతి దండన చేస్తుంది. మీరు మీ పట్టణాల్లో సమకూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. మీరు శత్రువుల వశమైపోతారు.


“సేనల ప్రభువు యెహోవా ఆజ్ఞ ఇస్తున్నదేమిటంటే నాలుగవ నెల ఉపవాసం, ఐదవ నెల ఉపవాసం, ఏడవ నెల ఉపవాసం, పదవ నెల ఉపవాసం, యూదా యింటివారికి సంతోషం ఉత్సాహం పుట్టించే మనోహరమైన పండగలౌతాయి. కాబట్టి సత్యాన్ని, శాంతిసమాధానాలును ప్రేమించండి.”


ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.


యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ