Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 బబులోను అకస్మాత్తుగా కూలిపోతుంది. సర్వనాశనమౌతుంది. ఆమె కోసం విలపించండి! ఆమె వేదన తీరడానికి ఔషధం ఇవ్వండి. ఆమెకు ఒకవేళ స్వస్థత కలుగుతుందేమో,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ లాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలై పోతుంది. దాని కొరకు విలపించండి! దాని బాధ నివారణకు మందుతెండి! బహుశః ఆమెకు నయం కావచ్చు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

చూడండి, రథాన్ని తోలుకుంటూ ఒక వ్యక్తి గుర్రాలెక్కి వస్తున్న రౌతులతో వస్తున్నాడు. వాళ్ళు జంటలుగా ఒక దళంగా వస్తున్నారు. అతడు పిలిచి ఇలా చెప్పాడు. “బబులోను కూలి పోయింది. నిజంగానే కూలిపోయింది. దాని చెక్కిన దేవుళ్ళ బొమ్మలన్నీ విరిగి నేలకూలాయి.”


వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు. కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు. నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది.


పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి. నువ్వు ఎంతగా శకునం చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాలపై ఆధారపడినా ఈ అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి.


కన్య అయిన ఐగుప్తు కుమారీ, గిలాదుకి వెళ్లి ఔషధం తెచ్చుకో. నీ పైన ఎక్కువ ఔషధాలు ఉపయోగించడం వ్యర్ధం. నీకు స్వస్థత కలుగదు.


మోయాబుకు అవమానం జరిగింది. అది ధ్వంసమై పోయింది. రోదించండి, పెడబొబ్బలు పెట్టండి. సహాయం కోసం కేకలు వేయండి. మోయాబు సమూలంగా నాశనమైందని అర్నోను నదీ తీరాన ఉన్న వాళ్లకు చెప్పండి.


కాబట్టి మోయాబు కోసం నేనే ఒక రోదనం చేస్తాను. మోయాబు అంతటి కోసం వేదనతో కేకలు పెడతాను. కీర్హరెశు ప్రజలు కోసం ఏడుస్తాను.


దేశాల్లో, జాతుల్లో ప్రకటించండి. అందరూ వినేలా చేయండి. వాళ్ళు వినడానికి సూచనగా ఒక జెండాను ఎత్తి ఉంచండి. దాన్ని కనబడనివ్వండి. ఇలా చెప్పండి. “బబులోనును ఆక్రమించుకున్నారు. బేలు దేవుడికి అవమానం కలిగింది. మెరోదకు దేవుడికి వ్యాకులం కలిగింది. వాళ్ళ విగ్రహాలకు అవమానం కలిగింది., వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పతనమయ్యాయి.


బబులోనును ఎలా పట్టుకున్నారు? భూమిపై అందరూ పొగిడే పట్టణం లొంగిపోయింది. రాజ్యాలన్నిటిలో బబులోను ఎలా శిథిల దేశంగా మారింది?


గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు?


“నరపుత్రుడా, ప్రవచిస్తూ ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, ‘అయ్యో! రాబోతున్న ఆ రోజు ఎంత భయంకరం.’


అందువల్ల ఆ దేవుని సన్నిధి నుండి ఈ చెయ్యి వచ్చి ఈ విధంగా రాసింది. రాసిన విషయం ఏమిటంటే, ‘మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌.’


అరవై రెండు సంవత్సరాల వయసున్న మాదీయ రాజు దర్యావేషు సింహాసనం అధిష్టించాడు.


నీకు తగిలిన దెబ్బ తీవ్రమైనది. నీ గాయాన్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. నిన్ను గూర్చిన వార్త విన్న వాళ్ళంతా నీకు జరిగిన దానికి సంతోషంతో చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రజలంతా నీచేత ఎడతెగకుండా హింసల పాలయ్యారు.


వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు.


అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ