Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:29 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 బబులోను దేశానికి విరోధంగా యెహోవా ఆలోచనలు కొనసాగుతాయి. కాబట్టి అది వేదన భారంతో ఉంటుంది. భూమి కంపిస్తుంది. అక్కడ నివసించే వాడు ఒక్కడూ లేకుండా బబులోనును పనికిరాని నేలగా చేయాలని ఆయన సంకల్పించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజలాడు చున్నది ఒక్క నివాసియులేకుండ బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిర మాయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

29 బాధలో వున్నట్లు ఆ రాజ్యం వణికిపోతుంది. యెహోవా తన పధకాన్ని అమలుపర్చటం మొదలు పెట్టినప్పుడు అది కంపించిపోతుంది. బబులోనును వట్టి ఎడారిగా మార్చటమే యెహోవా సంకల్పం. అక్కడ ఎవ్వరూ నివసించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, బబులోను దేశాన్ని పాడు చేయాలని అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, బబులోను దేశాన్ని పాడు చేయాలని అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:29
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిన్ను చూసిన వాళ్ళు నిన్ను నిదానించి చూస్తూ ఇలా అంటారు,


భూమి మత్తెక్కిన వాడిలాగా అదే పనిగా తూలుతోంది. పాకలాగా ఇటు అటు ఊగుతోంది. దాని అపరాధం దాని మీద భారంగా ఉంది. అది పడి ఇక లేవదు. భయంకరమైన వార్త విని పారిపోయే వాడు గుంటలో పడిపోతాడు. గుంటను తప్పించుకునేవాడు ఉరిలో చిక్కుతాడు.


అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు. ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.


యెహోవాకు కలిగిన క్రోధాన్ని బట్టి బబులోను నిర్మానుష్యమవుతుంది. సర్వనాశనమవుతుంది. బబులోను దారి గుండా వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దాని గాయాలను చూసి దాన్ని తిరస్కరిస్తారు.


తమను తాము మూర్ఖుల్లా కనపరచుకోడానికి వాళ్ళలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. సైనికులు భయకంపితులు అయ్యేలా ఒక కత్తి వాళ్ళకు విరోధంగా వస్తూ ఉంది.


బబులోను రాజు వాళ్ళను గూర్చిన సమాచారం విన్నాడు. భయంతో అతని చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించ బోయే స్త్రీకి కలిగే వేదన లాంటిది అతనికి కలిగింది.


బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినండి. కల్దీయుల దేశాన్ని గూర్చి ఆయన ఉద్దేశించినది వినండి. నిశ్చయంగా మందలోని అల్పులైన వారిని వారు లాగుతారు. నిశ్చయంగా వారిని బట్టి వారు నివసించిన ప్రదేశం నిర్ఘాంతపోతుంది.


బబులోనును ఆక్రమించుకుంటున్నారు అనే వార్త విని భూమి కంపిస్తున్నది. జనాల్లో అంగలార్పు వినబడుతున్నది.”


ఇళ్ళు కట్టుకునే వాళ్ళు గోడ మూలాలకు గానీ, పునాదికి గానీ నీ రాళ్ళు వాడుకోరు. నువ్వు ఎప్పటికీ నాశనమయ్యే ఉంటావు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.


ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి. మాదీయుల రాజులను, ఏలికలను పిలవండి. రాజు కింద అధికారులను, అతడి ఆధీనంలో ఉన్న దేశాలన్నిటినీ దాడి చేయడం కోసం నియమించండి.


బబులోను ఒక పెద్ద చెత్త కుప్పలా ఉంటుంది. నక్కల నిలయంగా మారుతుంది. భయానికీ, ఎగతాళికీ కారణంగా ఉంటుంది. ఎవరూ అక్కడ నివాసం ఉండరు.


దాని పట్టణాలు నిర్జనంగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ మారిపోయాయి. ఎవ్వరూ నివాసముండని, ఎవరూ దాని మీదుగా ప్రయాణం చేయని ప్రాంతంలాగా మారిపోయాయి.


దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.


వాటి ముందు భూమి కంపిస్తున్నది, ఆకాశాలు వణుకుతున్నాయి. సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.


దీన్ని బట్టి భూమి కంపించదా? అందులో నివసించే వారంతా దుఃఖపడరా? నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశపు నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.


అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ