Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 50:35 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

35 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “కల్దీయులకూ. బబులోను నివాసులకూ వాళ్ళ నాయకులకూ, వాళ్ళల్లో జ్ఞానులకూ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

35 యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

35 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోనులో నివసించే ప్రజలను ఒక కత్తి చంపుగాక. బబులోను రాజును, అతని అధికారులను, జ్ఞానులను ఒక కత్తి హతము చేయుగాక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

35 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “బబులోనీయుల మీదికి బబులోనులో నివసించేవారి మీదికి దాని అధికారులు జ్ఞానుల మీదికి ఖడ్గం వస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

35 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “బబులోనీయుల మీదికి బబులోనులో నివసించేవారి మీదికి దాని అధికారులు జ్ఞానుల మీదికి ఖడ్గం వస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 50:35
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను. అద్భుతం వెనుక అద్భుతాన్ని చేస్తాను. వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది. వివేకుల వివేకం అదృశ్యమై పోతుంది.”


ఉత్తరదిక్కు నుండి నేనొకణ్ణి పురిగొల్పుతున్నాను. అతడు నా పేరున ప్రార్థిస్తాడు. అతడు సూర్యోదయ దిక్కునుండి వచ్చి ఒకడు బురద తొక్కే విధంగా, కుమ్మరి మన్ను తొక్కే విధంగా రాజులను అణగదొక్కుతాడు.


నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి. సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే.


యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. “అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను.


అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు. యెహోవా చేతుల్లో అనేకమంది చస్తారు.


లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.


అయ్యో, యెహోవా ఖడ్గమా, నువ్వు ఎప్పటికి చాలించుకుంటావు? ఇక ఆగు. నీ వరలోకి పోయి మౌనంగా ఉండు.


ఆమె యెడ్లన్నిటినీ చంపండి. వధశాలకు వాటిని పంపండి. అయ్యో, వాళ్ళకు బాధ. వాళ్ళ దినం, వాళ్ళ శిక్షాకాలం వచ్చింది.


కాబట్టి ఆమె యువకులు పట్టణం వీధుల మూలల్లో పడిపోతారు. ఆమె కోసం యుద్ధం చేసే వీరులందరూ ఆ రోజున నాశనమౌతారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.


వాళ్ళు దురాశతో ఉద్రేకం చూపినప్పుడు వాళ్ళ కోసం ఒక విందు ఏర్పాటు చేస్తాను. వాళ్ళు బాగా సంతోషపడేలా వాళ్ళతో మద్యం తాగిస్తాను. అప్పుడు వాళ్ళు శాశ్వత నిద్రలోకి వెళ్తారు. ఇక మేల్కొనరు. ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.


కాబట్టి చూడండి, బబులోను లోని చెక్కిన విగ్రహాలను నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి. ఆమె దేశం అంతా సిగ్గుపాలు అవుతుంది. వధకు గురైన ఆమె ప్రజలు దేశంలోనే పడిపోతారు.


బబులోను అధిపతులూ, ఆమె జ్ఞానులూ, ఆమె అధికారులూ, ఆమె సైనికులూ మద్యం తాగి మత్తెక్కేలా చేస్తాను. వాళ్ళు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇక లేవరు.” ఇది రాజు చేస్తున్న ప్రకటన. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.


జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు. వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?


యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.


అదే రాత్రి బెల్షస్సరు అనే ఆ కల్దీయుల రాజును చంపేశారు.


వారి పథకాలను బట్టి యుద్ధం వారి పట్టణాలను ఆవరిస్తుంది. అది వారి పట్టణపు గడియలు విరగ్గొడుతుంది. వారిని నాశనం చేస్తుంది.


మీ మీదికి కత్తి రప్పిస్తాను. అది నా నిబంధన విషయం ప్రతి దండన చేస్తుంది. మీరు మీ పట్టణాల్లో సమకూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. మీరు శత్రువుల వశమైపోతారు.


మందను విడిచిపెట్టే పనికిమాలిన కాపరికి బాధ తప్పదు. వాడి చెయ్యి, కుడి కన్ను కత్తివేటుకు గురౌతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిదైపోతుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ