ఎందుకంటే, నేను నీతో ఉన్నాను,’ యెహోవా వాక్కు ఇదే, ‘నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏ దేశాల్లోకైతే చెదరగొట్టానో, ఆ దేశాలన్నిటినీ నేను సమూల నాశనం చేస్తాను. కాని, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చెయ్యను. అయితే నిన్ను తగిన క్రమశిక్షణలో పెడతాను. శిక్ష లేకుండా మాత్రం నిన్ను విడిచిపెట్టను.’
నీ పంట, నీ ఆహారం వారి చేతిలో నాశనం అవుతుంది. నీ కొడుకులనూ, కూతుళ్ళనూ, నీ గొర్రెలనూ, నీ పశువులనూ నాశనం చేస్తారు. నీ ద్రాక్షచెట్ల, అంజూరు చెట్ల ఫలాన్ని నాశనం చేస్తారు. నీవు ఆశ్రయంగా భావించిన ప్రాకారాలుగల పట్టణాలను వారు కత్తి చేత కూలదోస్తారు.
“మన దేవుడు యెహోవా మనకెందుకు ఇలా చేశాడు?” అని అడిగినప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవుళ్ళను పూజించారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్య ప్రజలకు సేవ చేస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు.
నేను ఆ ప్రకారమే ప్రవచిస్తూ ఉండగా బెనాయా కొడుకైన పెలట్యా చచ్చిపోయాడు. దాంతో నేను సాష్టాంగపడి పెద్ద స్వరంతో “అయ్యో! ప్రభూ, యెహోవా, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళని సమూలంగా నాశనం చేస్తావా?” అన్నాను.
వాళ్ళు చంపడం మొదలు పెట్టిన తరువాత నన్ను తప్ప వాళ్ళు అందరినీ చంపడం చూశాను. నేను ఒంటరిగా ఉండటం చూసి నేను సాష్టాంగ పడ్డాను. గట్టిగా వేడుకున్నాను. “అయ్యో! ప్రభూ! యెహోవా, యెరూషలేముపై నీ క్రోధాన్ని కుమ్మరించి ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేస్తావా?” అన్నాను.
యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? మేము మరణించము. యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు.