Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 48:32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 సిబ్మా ద్రాక్ష చెట్టూ, యాజెరు గూర్చి నేను ఏడ్చిన దాని కంటే ఎక్కువగా నీ కోసం విలపిస్తాను! నీ తీగెలు ఉప్పు సముద్రాన్ని దాటాయి. అవి యాజెరు వరకూ వ్యాపించాయి. వినాశకుడు నీ వేసవి కాలం పంట పైనా, నీ ద్రాక్షారసం పైనా దాడి చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను! సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి. అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి. కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 షిబ్మా ద్రాక్షలారా, యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను. మీ కొమ్మలు సముద్రం వరకు వ్యాపించాయి; అవి యాజెరు వరకు వ్యాపించాయి. నాశనం చేసేవాడు, పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 షిబ్మా ద్రాక్షలారా, యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను. మీ కొమ్మలు సముద్రం వరకు వ్యాపించాయి; అవి యాజెరు వరకు వ్యాపించాయి. నాశనం చేసేవాడు, పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 48:32
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

చూడండి, మన దగ్గరికి వచ్చే కల్దీయులను కలుసుకోడానికి నేను మిస్పాలో కాపురం ఉంటున్నాను. కాబట్టి ద్రాక్షారసం తయారుచేసుకోండి. వేసవికాల ఫలాలు, నూనె సమకూర్చుకుని, పాత్రల్లో నిల్వ చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివాసం ఉండండి.”


మోయాబు సర్వనాశనమవుతుంది. దాని పట్టణాలు దాడులకు గురౌతాయి. దాని యువకుల్లో శ్రేష్ఠమైన వాళ్ళు వధ జరిగే ప్రదేశానికి వెళ్తున్నారు. సేనల ప్రభువైన యెహోవా అనే పేరున్న రాజు చేస్తున్న ప్రకటన ఇదే!


దేబోనులో గౌరవపీఠంపై కూర్చున్నదానా, కిందకు దిగి రా. ఎండిన నేలపై కూర్చో. ఎందుకంటే మోయాబును నాశనం చేయబోయే వాడు నీపై దాడి చేస్తున్నాడు. అతడు నీ కోటలను నాశనం చేస్తాడు.


యెహోవా చెప్పినట్టు వినాశకుడు ప్రతి పట్టణం పైకీ వస్తాడు. ఏ పట్టణం కూడా తప్పించుకోలేదు. లోయ నశించి పోతుంది. మైదానం ధ్వంసమై పోతుంది.


అప్పుడు, యాజెరు దేశాన్ని సంచారం చేసి చూడడానికి మోషే మనుషులను పంపినప్పుడు వారు దాని గ్రామాలు స్వాధీనం చేసుకుని అక్కడున్న అమోరీయులను తోలివేశారు.


రూబేనీయులకు, గాదీయులకు, పశువులు అతి విస్తారంగా ఉండడం వలన యాజెరు, గిలాదు ప్రాంతాలు మందలకు తగిన స్థలమని వారు గ్రహించారు.


“అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అనే ప్రాంతాలు,


యాజెరు, యొగ్బెహ, బేత్నిమ్రా, బేత్హారాను


షిబ్మా అనే ఊళ్లు కట్టి, వాటికి కొత్త పేర్లు పెట్టారు.


కిర్యతాయిము, సిబ్మాలోయ లోని కొండ మీది శెరెత్షహరు ప్రాంతాలు దక్కించుకున్నారు.


వారి సరిహద్దు యాజెరు, గిలాదు పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకూ అమ్మోనీయుల దేశంలో సగభాగం.


హెష్బోను, దాని పచ్చిక మైదానాలనూ యాజెరు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ