Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 48:17 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 మోయాబు చుట్టూ నివసించేవాళ్ళు, దాని కీర్తి ప్రతిష్టలు తెలిసిన వాళ్ళు రోదించండి. ‘దాని బలమైన రాజదండం, ఘనత పొందిన దాని చేతిలోని కర్ర విరిగిపోయాయి’ అని చెప్తూ విలపించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి వినినవారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి. మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు. అందువల్ల వానికొరకు మీరు విచారించండి. ‘అధిపతుల అధికారం విరిగిపోయింది. మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’ అని మీరు చెప్పండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 దాని చుట్టూ నివసించేవారలారా, దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 దాని చుట్టూ నివసించేవారలారా, దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 48:17
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.


అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.


వాళ్ళు ఆగ్రహంతో నిరంకుశ బలత్కారంతో జాతులను లోబరచుకున్నారు.


ఎందుకంటే హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్షాతీగెలు వాడిపోయాయి. దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జాతుల అధికారులు అణగదొక్కారు. అవి యాజరు వరకూ వ్యాపించాయి, ఎడారిలోకి పాకాయి. దాని తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.


మిద్యాను దినాన జరిగినట్టు అతని బరువైన కాడిని నువ్వు విరిచావు. అతని మెడ మీద ఉన్న దుంగను, అతణ్ణి తోలే వాడి కొరడాలను విరగగొట్టావు.


“ఇది ఎలా సర్వ నాశనమైంది? వీళ్ళు రోదిస్తూ ఎలా కేకలు పెడుతున్నారో! మోయాబు సిగ్గుతో వెనక్కి తిరిగింది. కాబట్టి మోయాబు తన చుట్టూ ఉన్న వాళ్లకు భయాన్ని కలిగించేదిగా, పరిహాసం చేయదగ్గదిగా ఉంటుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ