Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 46:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు. ఉత్తర దిక్కులో వాళ్ళు యూఫ్రటీసు నదీ తీరంలో తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందువారు తొట్రిల్లిపడుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 “వేగంగా పరుగెత్తేవారు, బలవంతులు కూడా తప్పించుకోలేరు. వారు తూలి పడిపోతారు. ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 46:6
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని కాలంలో ఐగుప్తురాజు ఫరో నెకో అష్షూరురాజుతో యుద్ధం చెయ్యడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తనను యుద్ధంలో ఎదుర్కోడానికి వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర చంపాడు.


బబులోనురాజు ఐగుప్తు నదికీ, యూఫ్రటీసు నదికీ మధ్య ఐగుప్తురాజు ఆధీనంలో ఉన్న భూమి అంతటినీ పట్టుకొన్న తరువాత, ఐగుప్తురాజు ఇక ఏ ప్రాంతం మీదకీ యుద్ధానికి వెళ్ళలేదు.


నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.


నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, వేగం గలవారు పరుగులో గెలవరు. బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. తెలివైన వారికి ఆహారం లభించదు. అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.


చాలా మంది వాటికి తగిలి తొట్రుపడి కాళ్లు చేతులు విరిగి వలలో చిక్కి పట్టుబడతారు.


అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “ఉత్తరం నుండి ఈ దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది.


అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది.


ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూ ఉన్న ఈ ప్రజలందరి మీదికీ వారిని రప్పిస్తున్నాను. ఈ ప్రజలను నాశనం చేస్తాను. వాళ్ళను అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉంచుతాను.


సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను.


ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు. కత్తి శత్రువులని చీల్చివేస్తుంది. తృప్తి చెందుతుంది. వాళ్ళ రక్తాన్ని పానం చేస్తుంది. యూఫ్రటీసు నది దగ్గర ఉత్తర దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు బలి అర్పణ జరగబోతూ ఉంది.


నీకు కలిగిన అవమానం గూర్చి జాతులన్నీ తెలుసుకున్నాయి. నువ్వు చేసే రోదన ధ్వని భూమి అంతటా వినిపిస్తుంది. ఒక సైనికుడు తడబడి మరో సైనికుడి పైన పడతాడు. ఇద్దరూ కలసి కూలి పోతారు.”


తడబడే వాళ్ళ సంఖ్యను ఆయన అధికం చేస్తున్నాడు. ఒక్కో సైనికుడు మరొకడి మీద పడిపోతున్నాడు. వాళ్ళు “లేవండి, ఇంటికి వెళ్దాం. మన స్వంత ప్రజల దగ్గరకూ, మన స్వదేశానికీ వెళ్దాం. మనలను బాధిస్తున్న ఈ కత్తిని వదిలించుకుందాం.” అని చెప్పుకుంటున్నారు.


అహంకారి తడబడి కింద పడతాడు. వాణ్ణి ఎవరూ పైకి లేపరు. నేను అతడి పట్టణాల్లో అగ్ని రాజేస్తాను. అతని చుట్టూ ఉన్నదాన్ని అది మింగి వేస్తుంది.”


“బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి. ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది.


అప్పుడతడు తన దేశాలోని కోటల వైపు దృష్టి సారిస్తాడు గాని తొట్రుపడి కూలి, లేకుండా పోతాడు.


వరద ప్రవాహం వంటి గొప్ప సైన్యం అతని ఎదుట కొట్టుకు పోతుంది. ఒడంబడిక చేసిన అధిపతి అతని సైన్యంతోబాటు నాశనమై పోతాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ