Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 37:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యెహోయాకీము కొడుకు కొన్యాకు బదులుగా బబులోనురాజు నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషీయా కొడుకు సిద్కియా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా రాజుగా యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో సిద్కియాను నెబుకద్నెజరు నియమించాడు. సిద్కియా రాజైన యోషీయా కుమారుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యోషీయా కుమారుడైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాకు రాజుగా నియమించాడు. అతడు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో రాజయ్యాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యోషీయా కుమారుడైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాకు రాజుగా నియమించాడు. అతడు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో రాజయ్యాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 37:1
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యూదారాజు యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులూ, అతని పరివారం, బయలుదేరి బబులోనురాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు.


ఇంకా బబులోను రాజు యెహోయాకీను బాబాయి మత్తన్యాకు సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాడు.


సిద్కియా రాజు మల్కీయా కొడుకైన పషూరునూ, మయశేయా కొడుకూ, యాజకుడైన జెఫన్యానూ పిలిపించాడు.


యెహోవా చెప్పేదేమిటంటే. “యూదా రాజు యెహోయాకీము కొడుకు యెహోయాకీను నా కుడి చేతికి రాజముద్రగా ఉన్నా అక్కడ నుంచి నిన్ను పెరికివేస్తాను.


ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? యెహోయాకీను పనికిమాలిన కుండా? అతన్నీ అతని సంతానాన్నీ తమకు తెలియని దేశంలోకి వాళ్ళెందుకు తోసేశారు?


బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు.


“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు వెళ్లి యూదా రాజైన సిద్కియాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమంటే, చూడు, నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దానికి నిప్పుపెట్టి కాల్చేస్తాడు.


యూదా రాజైన యెహోయాకీను బందీగా వెళ్ళిన ముప్ఫై ఏడో సంవత్సరం పన్నెండో నెల ఇరవై ఐదో రోజున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన పరిపాలన మొదటి సంవత్సరంలో అతణ్ణి చెరసాల నుండి విడుదల చేశాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ