Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 35:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 యెహోవా మందిరంలో దైవజనుడైన యిగ్దల్యా కొడుకు, హానాను కొడుకుల గదిలోకి వాళ్ళను తీసుకొచ్చాను. అది రాజుల గదికి దగ్గరలో ఉన్న ద్వారపాలకుడూ, షల్లూము కొడుకు అయిన మయశేయా గదికి పైగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 ఆ రేకాబీయుల నందరినీ మందిరంలోనికి తీసికొని వచ్చాను. అందరం హానాను కుమారుల గది అనబడే దానిలోనికి వెళ్లాము. హానాను అనువాడు యిగ్దల్యా కుమారుడు. హానాను ఒక దైవజనుడు. ఈ గది యూదా రాజు ముఖ్యఅధికారులు బసచేసే గది ప్రక్కనే ఉంది, ఇది మయశేయా గదిపైనవుంది. మయశేయా అనేవాడు షల్లూము కుమారుడు. మయశేయా దేవాలయంలో ద్వార పాలకుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నేను వారిని యెహోవా మందిరంలోకి, అంటే దైవజనుడైన ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోకి తీసుకువచ్చాను. అది అధికారుల గది ప్రక్కనే ఉన్న ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయశేయా గదికి పైన ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నేను వారిని యెహోవా మందిరంలోకి, అంటే దైవజనుడైన ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోకి తీసుకువచ్చాను. అది అధికారుల గది ప్రక్కనే ఉన్న ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయశేయా గదికి పైన ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 35:4
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు.


ఒక దైవ సేవకుడు యెహోవా మాట చొప్పున యూదాదేశం నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు.


దారిలో నుండి అతన్ని తీసుకు వచ్చిన ఆ ప్రవక్త ఆ విషయం విని “యెహోవా మాట వినక ఎదురు తిరిగిన దైవ సేవకుడు ఇతడే. యెహోవా సింహానికి అతన్ని అప్పగించేసాడు. యెహోవా చెప్పినట్టు, అది అతన్ని చీల్చి చంపేసింది” అని చెప్పాడు.


ఆమె ఏలీయాతో “దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?” అంది.


ఆ స్త్రీ ఏలీయాతో “నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది” అంది.


అప్పుడొక దైవ సేవకుడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘సిరియా వాళ్ళు యెహోవా కొండల దేవుడే గాని లోయల దేవుడు కాడు’ అని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకొనేలా ఈ గొప్ప సమూహమంతటినీ నీ వశం చేస్తాను.”


అప్పుడు రాజు యాభై మంది సైనికులతో ఒక అధికారిని ఎలీయా దగ్గరికి పంపించాడు. ఎలీయా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఎలీయా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు” అన్నాడు.


యాజకుడు యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు కన్నం పెట్టి, బలిపీఠం పక్కన అంటే ఆలయంలో ప్రవేశించే వారికి కుడి వైపుగా దాన్నిఉంచాడు. మందిరంలోకి ప్రజలు తెచ్చే డబ్బంతా ద్వారపాలకులైన యాజకులు అందులో వేశారు.


నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.


అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.


అతడు అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక దేవుని మనిషి ఎలీషా సేవకుడైన గేహజీ ఇలా అనుకున్నాడు. “చూశావా, ఈ సిరియా వాడైన నయమాను తెచ్చిన కానుకలను తీసుకోకుండా నా యజమాని అతణ్ణి వదిలేశాడు. యెహోవా మీద ఒట్టు, నేనిప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను.”


ఇలా ఇశ్రాయేలు రాజు దేవుని మనిషి హెచ్చరిక చేసిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఇలా ఆనేకసార్లు దేవుని మనిషి చేసిన హెచ్చరిక రాజును రక్షించింది.


ఎవరి భుజంపై రాజు ఆనుకుని నిలబడ్డాడో ఆ అధికారిని ద్వారం దగ్గర ఉండమని రాజు ఆజ్ఞాపించాడు. అయితే ఆ అధికారి ప్రజల తొక్కిసలాటలో నలిగి చనిపోయాడు. రాజు తనని చూడడానికి వచ్చినప్పుడు దేవుని మనిషి చెప్పిన దాని ప్రకారం ఇది జరిగింది.


అప్పుడు రాజు ఒక అధికారి భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ఆ అధికారి దేవుని మనిషితో “చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?” అన్నాడు. దానికి ఎలీషా “చూస్తూ ఉండు. అలా జరగడం నీవు కళ్ళారా చూస్తావు గానీ దాంట్లో దేన్నీ తినవు” అని జవాబిచ్చాడు.


వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకుని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి.


అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు.


నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.


సిద్కియా రాజు మల్కీయా కొడుకైన పషూరునూ, మయశేయా కొడుకూ, యాజకుడైన జెఫన్యానూ పిలిపించాడు.


యూదా అధికారులు ఈ మాటలు విని రాజ భవనంలో నుంచి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిరపు కొత్త ద్వారం ప్రవేశంలో కూర్చున్నారు.


కాబట్టి నేను, యిర్మీయా కొడుకూ, యజన్యా మనవడూ అయిన హబజ్జిన్యాను, అతని సోదరులను, అతని కొడుకులందరినీ అంటే రేకాబీయుల కుటుంబికులను తీసుకొచ్చాను.


రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.


ప్రతి గుమ్మం స్తంభాల దగ్గర వాకిలి ఉన్న ఒక గది ఉంది. ఆ గదుల్లో దహనబలి పశువుల మాంసం కడుగుతారు.


నాకు, వారికి మధ్య ఒక్క గోడ మాత్రం ఉంచి నా గుమ్మాల పక్కనే వారి గుమ్మాలు, నా ద్వారబంధాల పక్కనే వారి ద్వారబంధాలు నిలబెట్టి, నా పవిత్రమైన పేరుకు ఇక ముందు అవమానం కలిగించరు. వారు చేసిన అకృత్యాల చేత నా పవిత్రమైన పేరును దూషణపాలు చేశారు కాబట్టి నేను ఆగ్రహంతో వారిని నాశనం చేశాను.


దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు


దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు.


యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు కెనెజీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబు అతనితో ఇలా మనవి చేశాడు. “కాదేషు బర్నేయలో దైవజనుడు మోషేతో యెహోవా నన్ను గూర్చీ నిన్ను గూర్చీ చెప్పిన మాట నీకు తెలుసు.


ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. “యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, ‘నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ