యిర్మీయా 35:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ‘ద్రాక్షారసం తాగొద్దు,’ అని రేకాబు కొడుకు యెహోనాదాబు తన కొడుకులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి, ఈ రోజు వరకూ తమ పితరుడి ఆజ్ఞకు విధేయులై వాళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు. కాని, నేను ఉదయాన్నే లేచి మీతో ఎంతో శ్రద్ధగా మాట్లాడినా, మీరు నా మాట వినరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటివరకు తమపితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు; అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 “రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షారసం త్రాగవద్దని తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించబడింది. ఈ రోజు వరకూ యెహోనాదాబు సంతతి వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు ద్రాక్షారసం త్రాగరు. కాని నేను యెహోవాను. యూదా ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ‘రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగకూడదని తన వారసులకు ఆదేశించగా అది స్థిరంగా ఉంది. వారు తమ పూర్వికుల ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి నేటికీ వారు ద్రాక్షరసం త్రాగరు. అయితే నేను మీతో పదే పదే మాట్లాడుతున్నా, మీరు నా మాట వినట్లేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ‘రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగకూడదని తన వారసులకు ఆదేశించగా అది స్థిరంగా ఉంది. వారు తమ పూర్వికుల ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి నేటికీ వారు ద్రాక్షరసం త్రాగరు. అయితే నేను మీతో పదే పదే మాట్లాడుతున్నా, మీరు నా మాట వినట్లేదు. အခန်းကိုကြည့်ပါ။ |
నేను వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు, ఎందుకు? నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబు చెప్పలేదెందుకు? నా చెయ్యి మిమ్మల్ని విమోచించలేనంత కురచగా అయి పోయిందా? విడిపించడానికి నాకు శక్తి లేదా? నా గద్దింపుతో సముద్రాన్ని ఎండిపోయేలా చేస్తాను. నదులను ఎడారిగా చేస్తాను. నీళ్లు లేకపోవడం చేత వాటిలోని చేపలు చచ్చిపోయి కంపుకొడతాయి.