Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 32:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 జ్ఞానంలో, శక్తిగల కార్యాలు చెయ్యడంలో నువ్వు గొప్పవాడివి. ప్రతివాడి పనులను బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్లకు తగినది ఇవ్వడానికి, తెరిచిన నీ కళ్ళు ప్రజలందరి మార్గాలు చూస్తున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియా ఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నర పుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 మీ ఉద్దేశాలు గొప్పవి, మీ క్రియలు బలమైనవి. మీ కనుదృష్టి సర్వ మానవాళిపై ఉన్నది; మీరు ప్రతిఒక్కరికి వారి ప్రవర్తనకు, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 మీ ఉద్దేశాలు గొప్పవి, మీ క్రియలు బలమైనవి. మీ కనుదృష్టి సర్వ మానవాళిపై ఉన్నది; మీరు ప్రతిఒక్కరికి వారి ప్రవర్తనకు, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 32:19
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు ఆకాశం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చి, హాని చేసినవాడి తల మీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున అతనికిచ్చి అతని నీతిని నిర్ధారించు.


తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటినుండి నీకు అన్నీ యుద్ధాలే.”


మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు.


ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు.


యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.


యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.


కృప చూపడం నీకే చెల్లుతుంది. ఎందుకంటే ప్రభూ, మనుష్యులందరికీ వారు చేసిన క్రియల ప్రకారం నువ్వే ప్రతిఫలమిస్తున్నావు.


పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.


పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?


మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.


అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే.


ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.


దీన్ని కూడా మనుషులకు సేనల ప్రభువైన యెహోవా నేర్పిస్తున్నాడు. ఆయన బోధ అద్భుతంగానూ ఆయన ఆలోచన శ్రేష్టంగానూ ఉంటుంది.”


యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఒక మంత్రిలాగా ఆయనకు సలహా చెప్పిన వాడెవడు? ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఆలోచన అడిగాడా?


వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగా తిరిగి చేస్తాడు. ఆయన తన విరోధులను కోపంతో శిక్షిస్తాడు. తన శత్రువులపట్ల ప్రతీకారం తీర్చుకుంటాడు. ద్వీపవాసులను కూడా తగురీతిగా శిక్షిస్తాడు.


ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.


ఎందుకంటే వారు వెళ్ళిన దారులన్నిటి మీద నా దృష్టి ఉంది. ఏదీ నాకు కనిపించకుండా పోలేదు. వారి దోషం నా కళ్ళకు తేటతెల్లమే.


నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.


మీ పనులకు తగినట్టు మిమ్మల్ని దండిస్తాను. అడవుల్లో నిప్పు పెడతాను. అది దాని చుట్టూ ఉన్నదాన్నంతా కాల్చివేస్తుంది.” ఇది యెహోవా వాక్కు.


నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో ఎవరైనా దాక్కోగలరా? అని యెహోవా అడుగుతున్నాడు. నేను భూమ్యాకాశాల్లో ఉన్నాను కదా? ఇది యెహోవా వాక్కు.”


ఎందుకంటే నేను వాళ్ళ పనులకూ వాళ్ళు చేతులతో చేసిన వాటికీ ప్రతీకారం చేస్తాను. అనేక రాజ్యాలూ, గొప్ప రాజులూ వాళ్ళ చేత సేవ చేయించుకుంటారు.


చేతి సహాయం లేకుండా పర్వతం నుండి వేరైన ఆ రాయి ఇనుముని, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలు చేయడం మీరు చూశారు గదా. జరగబోయే విషయాలు ఇలాగే ఉంటాయి. జరగబోయే సంభవాలు దేవుడు ముందుగానే మీకు వెల్లడిపరిచాడు. మీకు వచ్చిన కల యథార్థం. దాని వివరణ నమ్మదగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు.


భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.


హద్రాకు దేశాన్ని గూర్చి, దమస్కు పట్టణాన్ని గూర్చి వచ్చిన దేవోక్తి.


మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.


అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.


మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.


క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని,


సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.


ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.


“చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ