Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 3:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నీ తలెత్తి చెట్లు లేని కొండప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా? ఎడారి దారిలో సంచార జాతి వాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు. నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 “యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు. నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట ప్రక్కన విటుల (అబద్ధపు దేవుళ్ల) కోసం వేచివున్నావు. ఎడారిలో కూర్చున్న అరబీయునివలె నీవక్కడ కూర్చున్నావు. నీవు దేశాన్ని ‘అపవిత్రం’ చేశావు! ఏమైనంటావా? నీవు చాలా దుష్కార్యాలు చేశావు. నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు. నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా? ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు, ఎడారిలో అరబీయునిగా కూర్చున్నావు. నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో దేశాన్ని అపవిత్రం చేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు. నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా? ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు, ఎడారిలో అరబీయునిగా కూర్చున్నావు. నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో దేశాన్ని అపవిత్రం చేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 3:2
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.


అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు.


యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అష్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికీ, కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికీ, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికీ ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు.


నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.


దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది.


ఆమె తిరుగుబోతు. అదుపు లేకుండా తిరుగుతూ ఉండేది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు.


వినాశకులు అరణ్యంలోని ఖాళీ స్థలాలన్నిటి మీదకీ వస్తున్నారు. దేశం ఈ అంచు నుండి ఆ అంచు వరకూ యెహోవా ఖడ్గం తిరుగుతూ హతం చేస్తున్నది. నరులన్నవారికి ఏమీ భద్రత లేదు.


పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా “నేను నిన్ను పూజించను” అని చెబుతున్నావు. ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా వేశ్యలాగా వ్యభిచారం చేశావు.


“నాలో అపవిత్రత లేదు, బయలు దేవుళ్ళ వెనక నేను వెళ్ళడం లేదు” అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? లోయల్లో నీవెలా ప్రవర్తించావో చూడు. నువ్వు చేసిన దాన్ని గమనించు. నువ్వు విచ్చలవిడిగా తిరిగే ఒంటెవి.


ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను. అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.”


ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది. అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా. నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.


నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు. నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.


వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది. వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు.


రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.


తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు. నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి.


అప్పుడు నువ్వు నీ వస్త్రాలతో రంగురంగులతో అలంకరించిన దేవాలయాలు నీ కోసం చేసుకుని, వాటి దగ్గర ఒక వేశ్యలా ప్రవర్తించావు. ఇలా జరగాల్సింది కాదు. ఇది జరగక పొతే బాగుండేది.


వాళ్లకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోకి నేను వాళ్ళను రప్పించిన తరువాత, ఒక ఎత్తయిన కొండను గాని, ఒక దట్టమైన చెట్టును గాని వాళ్ళు చూసినప్పుడెల్లా బలులు అర్పిస్తూ, అర్పణలు అర్పిస్తూ, అక్కడ పరిమళ ధూపం వేస్తూ, పానార్పణలు చేస్తూ, నాకు కోపం పుట్టించారు.”


వారి తల్లి కులట. వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.


“అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి.


మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ