యిర్మీయా 3:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను. నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెద ననుకొనియుంటిని. నీవు–నా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 యెహోవానైన నేనిలా అనుకున్నాను, “మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం. మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది. ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది. మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 “నేను నేనే ఇలా అన్నాను, “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను మీకు ఆహ్లాదకరమైన భూమిని, ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 “నేను నేనే ఇలా అన్నాను, “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను మీకు ఆహ్లాదకరమైన భూమిని, ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။ |