యిర్మీయా 29:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,’ ఇది యెహోవా వాక్కు. ‘నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు’ ఇది యెహోవా వాక్కు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 గనుక నేను ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును; నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయకారణముగాను అపహాస్యా స్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.