Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 29:17 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను వాళ్ళ మీదికి ఖడ్గం, కరువు, తెగులు పంపబోతున్నాను. తినడానికి వీలు లేని కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలా వాళ్ళను చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను వారిమీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను; కుళ్లి కేవలము చెడిపోయి తినశక్యముకాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేనువారిని అప్పగించుచున్నాను;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను ఖడ్గాన్ని, కరువును, తెగులును వారిపైకి పంపుతాను, వారిని తినడానికి పనికిరాని చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను ఖడ్గాన్ని, కరువును, తెగులును వారిపైకి పంపుతాను, వారిని తినడానికి పనికిరాని చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 29:17
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఏ దేశం, ఏ రాజ్యం బబులోను రాజు నెబుకద్నెజరు సేవ చేయదో, బబులోను రాజు కాడిని తన మెడ మీద పెట్టుకోదో ఆ దేశాన్ని నేను శిక్షిస్తాను. అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకూ ఆ దేశాన్ని కత్తితో కరువుతో అంటు రోగాలతో శిక్షిస్తాను.’ ఇది యెహోవా వాక్కు.


తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.


చూడు! పట్టణాన్ని స్వాధీనం చేసుకోడానికి ముట్టడి దిబ్బలు పైపైకి లేస్తున్నాయి. ఖడ్గం, కరువు, తెగులు రావడం వల్ల దాని మీద యుద్ధం చేసే కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించడం జరిగింది. నువ్వు ఏం చెప్పావో అది జరుగుతూ ఉంది. జరుగుతున్నది నువ్వు చూస్తున్నావు.


అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.


ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. దేశంలో ప్రజలకు ఆహరం బొత్తిగా లేకుండా పోయింది.


కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి.


ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.


అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ