Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 23:21 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 “నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవచించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు. కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు. నేను వారితో మాట్లాడలేదు. కాని వారు నా పేరుతో ప్రవచించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 నేను ఈ ప్రవక్తలను పంపలేదు, అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు; నేను వారితో మాట్లాడలేదు, అయినాసరే వారు ప్రవచించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 నేను ఈ ప్రవక్తలను పంపలేదు, అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు; నేను వారితో మాట్లాడలేదు, అయినాసరే వారు ప్రవచించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 23:21
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను. అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను.


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.


“మోసపు కలలను పలికే వాళ్లకు నేను విరోధిని. వాళ్ళు అబద్ధాలు చెబుతూ మోసంతో గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.” ఇది యెహోవా వాక్కు. “నేను వాళ్ళను పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వాళ్ళ వలన ఈ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు.” ఇదే యెహోవా వాక్కు.


కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీతో చెప్పే ప్రవక్తలు అబద్దమే ప్రవచిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళ మాటలు వినవద్దు.” ఇది యెహోవా వాక్కు.


“మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరూ మీకు ప్రవచించే మీ ప్రవక్తలు నాశనమవుతారు.”


అప్పుడు యిర్మీయా ప్రవక్త, హనన్యాతో ఇలా అన్నాడు. “హనన్యా, విను. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల చేత అబద్ధాలను నమ్మించావు.


“బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, ‘యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,


ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీ మధ్య ఉన్న ప్రవక్తలు, మంత్రగాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకుండా చూసుకోండి. మీలో కలలు కనే వాళ్ళు చెప్పే మాటలు వినకండి.


వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు.


అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు.


కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు.


ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ