Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 23:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 “నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.” ఇది యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా వాక్కు ఇదే–నా మందలో చేరిన . గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 23:1
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాపరులు మూర్ఖులై యెహోవాను అడగరు. కాబట్టి వారికి విజయం లేదు. వారి మందలన్నీ చెదరిపోతున్నాయి.


అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటలను పాడు చేశారు. నా ఆస్తిని తొక్కివేశారు. నాకిష్టమైన పొలాన్ని బీడుగా ఎడారిగా చేశారు.


ఇప్పుడు మీరు ఆ మాట వినకపోతే మీ గర్వం విషయంలో నేను రహస్యంగా విలపిస్తాను. యెహోవా మందను చెరగా పట్టుకున్నందుకు నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.


దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది. చెట్టుతో “నువ్వు మా తండ్రివి” అనీ, రాయితో “నువ్వే నన్ను పుట్టించావు” అనీ చెబుతూ, ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు.


“యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు.


నీ కాపరులంతా గాలికి కొట్టుకుపోతారు. నీ స్నేహితులంతా బందీలుగా వెళ్ళిపోతారు. అప్పుడు నీ దుర్మార్గమంతటి బట్టి నువ్వు కచ్చితంగా అవమానం పొంది సిగ్గుపడతావు.


ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన ప్రజలను మేపే కాపరులను గురించి ఇలా చెబుతున్నాడు. “మీరు నా గొర్రెలను చెదరగొట్టి వెళ్ళగొట్టారు. మీరు వాటిని అసలేమీ పట్టించుకోలేదు. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.


నా ప్రజలు దారి తప్పిన గొర్రెలు. వారి కాపరులు వారిని పర్వతాల పైకి తీసుకు వెళ్లి దారి మళ్ళించారు. ఒక కొండ నుండి మరో కొండకు వాళ్ళని తిప్పారు. వాళ్ళు వెళ్ళారు. చివరకు తాము నివసించిన చోటు మర్చిపోయారు.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. దర్శనం ఏదీ చూడకుండా సొంత ఆలోచనలను అనుసరించే తెలివి తక్కువ ప్రవక్తలకు బాధ!


యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.


మీరు భుజాలతో పక్కతో తోస్తూ ఉంటే, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ చెదరగొట్టేస్తున్నారు.


మీరు నా గొర్రెలు. నేను మేపే గొర్రెలు. నా ప్రజలు! నేను మీ దేవుణ్ణి. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”


నేను యెహోవానని వారు తెలుసుకునేలా అర్పణగా ఉన్న గొర్రెలంత విస్తారంగా, నియామక దినాల్లో యెరూషలేముకు వచ్చే గొర్రెలంత విస్తారంగా వారి పట్టణాల్లో మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించేలా నేను చేస్తాను.”


“కాపరులపై నా కోపాగ్ని మండుతున్నది. మందలో మేకలను నేను శిక్షిస్తాను” అని సేనల ప్రభువు యెహోవా అంటున్నాడు. ఆయన తన మందయైన యూదా ప్రజలను దర్శించి వాళ్ళను తన యుద్ధాశ్వాలుగా మలుచుకుంటాడు.


వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.


ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు.


దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.


జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.


నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ