యిర్మీయా 20:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదారాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబులోను దేశానికి పట్టుకు పోతాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు. အခန်းကိုကြည့်ပါ။ |