Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 18:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 వాళ్ళు నా ప్రాణం తీయాలని గుంట తవ్వారు. వాళ్లకు నేను చేసిన మేలుకు బదులు వాళ్ళు నాకు భయంకరమైన కీడు చేయాలా? వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ మీదనుంచి నీ కోపం తప్పించడానికి నీ ఎదుట నేను నిలబడి వాళ్ళ గురించి మాట్లాడిన సంగతి గుర్తుంచుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడుచేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను. వారు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నన్ను చంపే ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 మేలుకు ప్రతిగా కీడు చేయాలా? అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు. నేను నీ ఎదుట నిలబడి వారి మీది నుండి మీ కోపం తొలగించమని వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 మేలుకు ప్రతిగా కీడు చేయాలా? అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు. నేను నీ ఎదుట నిలబడి వారి మీది నుండి మీ కోపం తొలగించమని వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 18:20
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు తండ్రిలేని అనాథలను కొనేందుకు చీట్లు వేసే మనుషుల వంటివారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది.


అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు.


నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.


నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది.


కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.


నేను వాళ్లకు చేసిన మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినా వాళ్ళు నాపై నిందలు వేస్తున్నారు.


నా అడుగులను పట్టుకోడానికి వారు వల పన్నారు. నా ప్రాణం క్రుంగిపోయింది. వారు నా కోసం ఒక గుంట తవ్వారుగానీ దానిలో వారే పడ్డారు. సెలా.


వాడు గుంట తవ్వి, దాన్ని లోతు చేసి, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు.


మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.


గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.


గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది.


కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా అంగలార్చవద్దు, వేడుకోవద్దు. వారు తమ విపత్తులో నాకు మొర పెట్టినపుడు నేను వినను.


యెహోవా, మేము నీకు విరోధంగా పాపం చేశాం. మా దుర్మార్గాన్నీ మా పూర్వీకుల దోషాన్నీ మేము ఒప్పుకుంటున్నాం.


అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.”


నన్ను తరిమేవాళ్ళు సిగ్గుపడాలి, కానీ నన్ను సిగ్గుపడనివ్వొద్దు. నన్ను దిగులు పడనివ్వక వాళ్ళను దిగులు పడనివ్వు. వాళ్ళ మీదికి ఆపద రోజులు రప్పించు. రెట్టింపు నాశనం వాళ్ళ మీదికి రప్పించు.


యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను.


నన్ను పట్టుకోడానికి వాళ్ళు గొయ్యి తవ్వారు. నా కాళ్లకు ఉచ్చులు వేశారు. వాళ్ళ మీదికి నువ్వు అకస్మాత్తుగా దండెత్తే వాళ్ళను రప్పించడం వలన వారి ఇళ్ళలోనుంచి కేకలు వినబడాలి.


వాళ్ళు ప్రవక్తలైతే యెహోవా సందేశం వాళ్ళతో ఉంటే యెహోవా మందిరంలో యూదా రాజు మందిరంలో యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలి పోకుండా వాళ్ళు సేనల ప్రభువు యెహోవాను బతిమాలుకోవడం మంచిది.”


నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు. వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు.


కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా మొర్రపెట్టడం, విజ్ఞాపన చేయడం చేయవద్దు. నన్ను బతిమాలవద్దు. ఎందుకంటే నేను నీ మాట వినను.


యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.


యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు.


‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.


యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి “నీ సేవకుడైన దావీదు నీపట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడూ తలపెట్టవద్దు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ