Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 14:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అడవి గాడిదలు చెట్లులేని మెట్టల మీద నిలబడి నక్కల్లాగా రొప్పుతున్నాయి. మేత లేక వాటి కళ్ళు పీక్కుపోతున్నాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 అడవి గాడిదలు వట్టి కొండలపైన నిలబడతాయి. గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి. వాటి కంటికి ఆహారమే కన్పించదు. ఎందువల్లనంటే వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు లేవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి నక్కల్లా రొప్పుతాయి. మేత లేకపోవడంతో వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి నక్కల్లా రొప్పుతాయి. మేత లేకపోవడంతో వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 14:6
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజ భవనాన్ని విడిచి పెట్టేస్తారు. జనసమ్మర్దమైన పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. కొండ, నిఘా గోపురాలు ఇక ఎప్పటికీ గుహల్లా ఉంటాయి. అవి అడవి గాడిదలు ఆనందించే స్థలంగానూ, పశువులు మేసే స్థలంగానూ ఉంటాయి. దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ ఇలా జరుగుతుంది.


అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిదవు. అది కామంతో దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది. మగ గాడిదను కలిసినప్పుడు దాన్ని ఆపగల వాడెవడు? దాని వెంటబడే గాడిదలకు అలుపు రాదు. తన జత కోసం వెదికే కాలంలో అది తేలికగా కనిపిస్తుంది.


దొరకని సహాయం కోసం కనిపెట్టినా మా కళ్ళకు ఏదీ కనబడలేదు. రక్షించలేని ప్రజల కోసం మా కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి.


మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి.


మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి! పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి!


అందుకు యోనాతాను “నా తండ్రి మనుషులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ