Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 13:26 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 కాబట్టి మీకు సిగ్గు కలిగేలా నేను మీ బట్టల అంచులను లేపి మీ ముఖం మీద పడేలా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను. ప్రతివాడూ నిన్ను చూస్తాడు. నీవు అవమానం పాలవుతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 “నీ అవమానం కనబడేలా నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 “నీ అవమానం కనబడేలా నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 13:26
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది. నేను మనుషులపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు వారిపై జాలిపడను.


“ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి?” అని నీ మనస్సులో అనుకోవచ్చు. నువ్వు చేసిన విస్తారమైన దోషాలే దానికి కారణం. అందుకే నీ వస్త్రాలు తీసివేయడం, నీపై అత్యాచారం చేయడం జరుగుతుంది.


కానీ నేను ఏశావును నగ్నంగా నిలబెడుతున్నాను. అతని రహస్య స్థలాలను బహిర్గతం చేస్తున్నాను. అతడు ఇక ఎక్కడా దాక్కోలేడు. అతని సంతానం, సోదరులూ, అతడి పొరుగు వాళ్ళూ అంతా నాశనమవుతున్నారు. అతడూ మిగలడు.


యెరూషలేము ఘోరమైన పాపం చేసింది. ఆ కారణంగా అది ఒక రుతుస్రావం రక్తం గుడ్డలాగా అయ్యింది. దాన్ని ఘనపరచిన వాళ్ళందరూ దాని నగ్నత్వం చూసి దాన్ని తృణీకరించారు. అది మూలుగుతూ వెనుదిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది.


ఇదిగో! నువ్వు ఎవరితో పడుకున్నావో ఆ నీ ప్రేమికులందర్నీ, విటులందర్నీ, నువ్వు ద్వేషించే వాళ్ళందర్నీ నేను పోగుచేస్తున్నాను. వాళ్ళను నీ చుట్టూ పోగు చేసి, వాళ్లకు నీ మానం కనబడేలా నేను నీ దిగంబరత్వాన్ని బట్ట బయలు చేస్తాను!


ద్వేషంతో వాళ్ళు నిన్ను బాధిస్తారు. నీ కష్టార్జితమంతా చెరబట్టి నిన్ను వస్త్రహీనంగా, నగ్నంగా విడిచిపెడతారు. అప్పుడు వ్యభిచారం వల్ల నీకు కలిగిన అవమానం వెల్లడి ఔతుంది. నీ వేశ్యక్రియలు, నీ దుష్ప్రవర్తన వెల్లడి ఔతుంది.


దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు.


“ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.


సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ