యిర్మీయా 13:22 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 “ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి?” అని నీ మనస్సులో అనుకోవచ్చు. నువ్వు చేసిన విస్తారమైన దోషాలే దానికి కారణం. అందుకే నీ వస్త్రాలు తీసివేయడం, నీపై అత్యాచారం చేయడం జరుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 నీవు–ఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్22 “నాకెందుకీ చెడు దాపురించింది?” అని నీకు నీవే ప్రశ్నించుకో. నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు. నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది. నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి. నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 “నాకే ఎందుకు ఇలా జరిగింది?” అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నీ అనేక పాపాల కారణంగానే నీ వస్త్రాలు చింపబడ్డాయి నీ శరీరం అసభ్యంగా తాకబడింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 “నాకే ఎందుకు ఇలా జరిగింది?” అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నీ అనేక పాపాల కారణంగానే నీ వస్త్రాలు చింపబడ్డాయి నీ శరీరం అసభ్యంగా తాకబడింది. အခန်းကိုကြည့်ပါ။ |