Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 12:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నేను నా మందిరం విడిచిపెట్టాను. నా వారసత్వాన్ని వదిలేశాను. నా ప్రియమైన ప్రజలను వారి శత్రువుల చేతికి అప్పగించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను; నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువులచేతికి అప్పగించియున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 “నేను (యెహోవాను) నా ఇంటిని (యూదాను) వదిలివేశాను. నా స్వంత ఆస్తిని నేను వదిలివేశాను. నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 “నా ఇంటిని విడిచిపెడతాను, నా వారసత్వాన్ని వదిలివేస్తాను; నేను ప్రేమించిన దానిని తన శత్రువుల చేతికి అప్పగిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 “నా ఇంటిని విడిచిపెడతాను, నా వారసత్వాన్ని వదిలివేస్తాను; నేను ప్రేమించిన దానిని తన శత్రువుల చేతికి అప్పగిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 12:7
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇంకా, నా స్వాస్ధ్యంలో మిగిలిన వాళ్ళను నేను తోసివేసి, వాళ్ళ శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను.


కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు.


తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన వారసత్వం మీద కోపించాడు.


యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు. వాళ్ళు ఫిలిష్తీయుల్లాగా శకునం చూసే వాళ్ళలా ఉంటూ, పరదేశులతో స్నేహం చేస్తున్నారు గనుక నువ్వు వాళ్ళను విడిచి పెట్టేశావు.


దుష్ట తలంపులు కలిగిన నా ప్రియమైన ప్రజలకు నా మందిరంతో పనేంటి? బలుల కోసం నువ్వు మొక్కుకుని తెచ్చిన ప్రతిష్ఠితమైన మాంసం భుజించడం వలన నీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు చెడు జరిగించి సంతోషించావు.


నువ్వు యూదాను పూర్తిగా వదిలేశావా? సీయోను అంటే నీకు అసహ్యమా? మేము కోలుకోలేనంతగా నువ్వు మమ్మల్ని ఎందుకు కొట్టావు? మేము శాంతి కోసం ఆశించాం గానీ మేలు కలిగించేది ఏదీ రాలేదు. కోలుకునేలా ఎదురు చూశాం గానీ చుట్టూ భయానక దృశ్యాలే.


నేను నీకిచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మీరు నా కోపాగ్ని రగులబెట్టారు. అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది. నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నువ్వు బానిసవవుతావు.


మీరు ఈ మాటలు వినకపోతే ఈ పట్టణం పాడైపోతుంది.’ ఇది యెహోవా వాక్కు.”


ఈ ప్రజలు గానీ ప్రవక్త గానీ యాజకుడు గానీ నిన్ను “యెహోవా సందేశం ఏమిటి?” అని అడిగితే నువ్వు వారితో ఇలా చెప్పు. “ఏ సందేశం? నేను మిమ్మల్ని వదిలేశాను.” ఇది యెహోవా సందేశం.


కాబట్టి నేను మిమ్మల్ని ఏరి నా దగ్గర నుంచి పారవేస్తాను. మీకూ మీ పూర్వీకులకూ నేనిచ్చిన పట్టణాన్నీ పారవేస్తాను.


తమ దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా చేసిన అపరాధాలతో నిండిపోయినప్పటికీ, సేనల ప్రభువూ, తమ దేవుడూ అయిన యెహోవా యూదా ప్రజలనూ, ఇశ్రాయేలు ప్రజలనూ విడిచిపెట్టలేదు.


కాబట్టి నేను షిలోహుకు చేసినట్టే నా పేరు పెట్టిన ఈ మందిరానికీ, మీకూ మీ పూర్వికులకూ నేనిచ్చిన ఈ స్థలానికీ చేస్తాను.


తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు. నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి.


ఇశ్రాయేలీయులకు నువ్వు ఈ విధంగా చెప్పు, చూడు! ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ బలంలో మీకున్న అతిశయం, మీ నేత్రాశలు, మీ మనస్సులో మీకున్న వాంఛలు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నాయి! కాబట్టి, మీరు వెనుక విడిచిన మీ కొడుకులూ, కూతుళ్ళూ కత్తిచేత కూలిపోతారు.


“ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి, నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను.


గిల్గాలులో వారు చేసిన పాపం మూలంగా. అక్కడే నేను వారికి విరోధినయ్యాను. వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇక నా మందిరంలోనుండి తోలి వేస్తాను. వారిని ఇక మీదట ప్రేమించను. వారి అధికారులంతా తిరుగుబాటు చేసేవారు.


సీయోనులో బాకా ఊదండి. ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.


ఇతర ప్రజలందరినీ సమకూర్చి, యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి నేను అక్కడ వారిని శిక్షిస్తాను. వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి నా దేశాన్ని పంచుకున్నారు.


వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.


బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, యెహోవాకు ప్రియుడు. ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ