Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 12:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 వినాశకులు అరణ్యంలోని ఖాళీ స్థలాలన్నిటి మీదకీ వస్తున్నారు. దేశం ఈ అంచు నుండి ఆ అంచు వరకూ యెహోవా ఖడ్గం తిరుగుతూ హతం చేస్తున్నది. నరులన్నవారికి ఏమీ భద్రత లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు. యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు. రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు. ఏ ఒక్కరికీ రక్షణ లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు, యెహోవా ఖడ్గం భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది; ఎవరూ క్షేమంగా ఉండరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు, యెహోవా ఖడ్గం భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది; ఎవరూ క్షేమంగా ఉండరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 12:12
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తం చేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది. ఎందుకంటే బొస్రా నగరంలో యెహోవా బలి జరిగిస్తాడు. ఎదోము దేశంలో గొప్ప వధ చేస్తాడు.


“దుర్మార్గులకు ప్రశాంతత ఉండదు” అని దేవుడు చెబుతున్నాడు.


“మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.


యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను ఈ ప్రజలకు నా శాంతి, నా దయ, నా వాత్సల్యం తీసివేశాను, కాబట్టి విలపించే వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వాళ్ళను గురించి విలపించడానికి వెళ్ళవద్దు. ఎవరినీ ఓదార్చడానికి వెళ్ళవద్దు.” ఇది యెహోవా వాక్కు.


ఈ దేశమంతా పాడైపోతుంది. శిథిలమైపోతుంది. ఈ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తారు.


నీ తలెత్తి చెట్లు లేని కొండప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా? ఎడారి దారిలో సంచార జాతి వాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు. నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు.


వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది. వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు.


“యెహోవా ఇలా అంటున్నాడు, ‘భయంతో వణుకుతున్న స్వరం మేం విన్నాం. ఆ స్వరంలో శాంతి లేదు.


కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.


యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను.


ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు. కత్తి శత్రువులని చీల్చివేస్తుంది. తృప్తి చెందుతుంది. వాళ్ళ రక్తాన్ని పానం చేస్తుంది. యూఫ్రటీసు నది దగ్గర ఉత్తర దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు బలి అర్పణ జరగబోతూ ఉంది.


అయ్యో, యెహోవా ఖడ్గమా, నువ్వు ఎప్పటికి చాలించుకుంటావు? ఇక ఆగు. నీ వరలోకి పోయి మౌనంగా ఉండు.


మోయాబు గౌరవం అంతరించింది. వాళ్ళ శత్రువులు హెష్బోనులో దానికి కీడు చేయాలని ఆలోచిస్తున్నారు. ‘రండి, అది ఒక దేశంగా ఉండకుండా దాన్ని నాశనం చేద్దాం. మద్మేనా కూడా అంతరించి పోతుంది. కత్తి నిన్ను తరుముతూ ఉంది.’


మనం శాంతి సమాధానాల కోసం కనిపెట్టుకుని ఉన్నాం గానీ మనకేమీ మంచి జరగలేదు. క్షేమం కోసం కనిపెడుతున్నాం గానీ భయమే కలుగుతూ ఉంది అని వారు చెబుతారు.


నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.


నేను దేశానికి విరోధంగా ఖడ్గాన్ని పంపి ‘ఖడ్గమా, దేశమంతా సంచరించి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చెయ్యి’ అని ఆజ్ఞ ఇస్తే


నరపుత్రుడా నువ్వు ప్రవచించి ఇలా చెప్పు. “అమ్మోనీయులను గూర్చీ, వాళ్ళ అపకీర్తిని గూర్చీ ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఒక కత్తి! ఒక కత్తి దూసి ఉంది! పదును పెట్టిన కత్తి భారీగా వధ చెయ్యడానికి దూసి ఉంది, అది ఒక మెరుపులా ఉంది!


నీతిమంతుడుగాని, దుష్టుడుగాని ఎవరూ నీలో ఉండకుండాా దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ అందరినీ నేను తెంచివేయడానికి నా కత్తి శరీరులందరికీ విరోధంగా బయలుదేరింది.


యెహోవా నాకు ఈ సంగతి మళ్ళీ తెలియజేశాడు.


“నరపుత్రుడా, ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువు చెప్పేదేమంటే, ఒక కత్తి, ఒక కత్తి! అది పదునుపెట్టి ఉంది. అది మెరుగుపెట్టి ఉంది.


పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.


జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్లు పాడుబడిపోతాయి.


శత్రువులు వాళ్ళను బందీలుగా వేరే దేశాలకు తీసుకుపోయినా నేనక్కడ కత్తికి పని చెబుతాను. అది వాళ్ళను చంపేస్తుంది. మేలు చేయడానికి కాక కీడు చేయడానికే నా దృష్టి వారి మీద నిలుపుతాను.


కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత హతమైపోతారు.


నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. నా కత్తి, మాంసం భక్షిస్తుంది! చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, శత్రువు అధికారులనూ అవి తింటాయి.


అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయల్దేరింది. దాని పైన కూర్చున్న రౌతుకు పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ