యిర్మీయా 11:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 “యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’ အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’ အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా ఇలా అంటున్నాడు. “అరణ్యంలో ద్రాక్షపండ్లు దొరికినట్టు ఇశ్రాయేలువారు నాకు దొరికారు. వసంత కాలంలో అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు. అయితే వారు బయల్పెయోరు దగ్గరికి పోయారు. ఆ లజ్జాకరమైన దేవుడికి తమను అప్పగించుకున్నారు. తాము మోహించిన విగ్రహాల్లాగానే వారు కూడా అసహ్యులయ్యారు.”