Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 10:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి. అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయనేరవు మేలుచేయుట వాటివలనకాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి. వారి విగ్రహాలు మాట్లాడవు. వారి విగ్రహాలు నడవలేవు. ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి! కావున ఆ విగ్రహాలకు భయపడకు. అవి నిన్ను ఏమీ చేయలేవు. పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 10:5
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ “బయలు దేవుడా, మా ప్రార్థన విను” అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు.


అందువలన యెహోవా కోపం అమజ్యా మీద రగులుకుంది. ఆయన అతని దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు “నీ చేతిలోనుంచి తమ ప్రజలను విడిపించే శక్తి లేని దేవుళ్ళ దగ్గర నీవెందుకు విచారణ చేస్తావు?” అని అమజ్యాతో అన్నాడు.


మోయాబీయులు ఉన్నత స్థలానికి వచ్చి సొమ్మసిల్లి ప్రార్థన చెయ్యడానికి తమ గుడిలో ప్రవేశించినప్పుడు, వారి ప్రార్థనల వల్ల ప్రయోజనం ఏమీ లేదు.


కలిసి రండి, వివిధ రాజ్యాల్లో పరవాసులుగా ఉన్నవారంతా నా దగ్గర సమకూడండి. చెక్కిన విగ్రహాలను మోస్తూ రక్షించలేని ఆ దేవుళ్ళకు మొరపెట్టేవారు బుద్ధిహీనులు.


బేలు కూలిపోతూ ఉన్నాడు. నెబో కృంగుతూ ఉన్నాడు. వారి విగ్రహాలను జంతువులు, పశువులు మోస్తూ వెళ్తున్నాయి.


వారు దాన్ని తమ భుజాల మీద ఎక్కించుకుంటారు. దాన్ని మోసుకుపోయి దాని స్థానంలో నిలబెడతారు. అది అక్కడి నుండి కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. ఒకడు దానికి మొర్రపెట్టినా జవాబు చెప్పదు, ఎవరి బాధా తీసివేయలేదు, రక్షించలేదు.


ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు.


కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ. అవి ఏమైనా బోధించగలవా? దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు.


పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగవిగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు.


అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు.


అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ