Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 8:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అవి యూదా దేశంలోకి వచ్చి వరద పొంగులా ప్రవహిస్తాయి. అవి మెడలోతు అవుతాయి. ఇమ్మానుయేలూ, దాని రెక్కలు నీ దేశమంతా కప్పేస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 ఆ నదిలోంచి నీళ్లు పొంగి యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి. “ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచివేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ, గొంతు లోతు వరకు చేరుతాయి. ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు నీ దేశమంతట వ్యాపిస్తాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ, గొంతు లోతు వరకు చేరుతాయి. ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు నీ దేశమంతట వ్యాపిస్తాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 8:8
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని మీద అష్షూరురాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా, హోషేయ అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు.


షీషకు యూదాకు దగ్గరగా ఉన్న ప్రాకార పురాలను పట్టుకుని యెరూషలేము వరకూ వచ్చాడు.


భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.


ఆయన శ్వాస గొంతు వరకూ వచ్చిన బలమైన నదీ ప్రవాహంలా ఉంది. అది నాశనం చేసే జల్లెడలా జాతులను జల్లెడ పడుతుంది. ఆయన శ్వాస జాతుల దవడల్లో కళ్ళెంలా ఉండి వాళ్ళని దారి తప్పిస్తుంది.


నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు. నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు


కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.


యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు.


పథకం వేసుకోండి గానీ దాన్ని అమల్లో పెట్టలేరు. ఆజ్ఞ ఇవ్వండి గానీ ఎవరూ దాన్ని పాటించరు. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు.


“యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి. ఉత్తర దిక్కున నీళ్ళు వరదలా పొర్లి పారుతున్నాయి. వాళ్ళు వెల్లువలా పొంగిన నదిలా ఉంటారు. తర్వాత వాళ్ళు దేశం పైనా, దాని పట్టణాల పైనా, దానిలో నివాసముండే వాళ్ళ పైనా వెల్లువలా ప్రవహిస్తారు! కాబట్టి అందరూ సహాయం కోసం మొర్ర పెడతారు. దేశంలోని ప్రజలందరూ విలపిస్తారు.


యెహోవా ఇలా చెప్తున్నాడు. “తన రెక్కలను విప్పార్చుకుని ఎగిరే గద్దలా శత్రువు మోయాబు పైకి వస్తున్నాడు.


సముద్రం బబులోను పైకి వచ్చింది. భీకర హోరుతో అలలు దాన్ని ముంచెత్తాయి.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది.


యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నేను నిన్ను పాడుచేసి నిర్జనమైన పట్టణంగా చేసేటప్పుడు మహా సముద్రం నిన్ను ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాన్ని రప్పిస్తాను.


అతని కుమారులు యుద్ధ సన్నద్ధులై మహా సైన్యాలను సమకూర్చుకుంటారు. అతడు నది లాగా ముంచుకు వచ్చి కట్టలు తెంచుకుని ప్రవహిస్తాడు. యుద్ధం చేయబూని కోట దాకా వస్తాడు.


దాని గాయాలు మానవు. అవి యూదాకు తగిలాయి. నా ప్రజల గుమ్మం వరకూ, యెరూషలేము వరకూ అవి వచ్చాయి.


అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ