యెషయా 66:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదనువారిలో తప్పించుకొనినవారిని విలుకాండైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె దను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తువేస్తాను-వారిని నేను రక్షిస్తాను. రక్షించబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూదు, (విలుకాండ్ర దేశం), తూబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నింటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షించబడిన ప్రజలు నా మహిమను గూర్చి దేశాలకు చెబుతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 “నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 “నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
ఆ రోజుల్లో నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజలు, చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేస్తూ ఆ బలమైన జనాలు, నదులతో నిండి ఉన్న వాళ్ళ దేశం నుండి సేనల ప్రభువు అయిన యెహోవాకు కానుకలు తీసుకుని వస్తారు. సేనల ప్రభువు అయిన యెహోవా నామాన్ని ధరించిన సీయోను పర్వతానికి తీసుకు వస్తారు.