Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 59:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వారి సాలెగూళ్ళు బట్టలు నేయడానికి పనికిరావు. వాళ్ళు నేసిన దానితో ఎవరూ కప్పుకోలేరు. వాళ్ళ పనులు పాపిష్టి పనులు. దుష్టక్రియలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదువారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో గింపదు వారి క్రియలు పాపక్రియలేవారు బలాత్కారము చేయువారే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 వారు అల్లే ఈ గూళ్లు బట్టలకు ఉపయోగపడవు. ఆ గూళ్లతో నిన్ను నీవు కప్పుకోలేవు. కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరులను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు. వారి పనులు చెడుపనులు. వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు. వారి పనులు చెడుపనులు. వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 59:6
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.


ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటిరెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది.


అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. అణచివేత, కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి.


లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.


“తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “వాళ్ళు ఆలోచనలు చేస్తారు. కానీ నన్ను సంప్రదించరు. ఇతర జనాలతో స్నేహం చేస్తారు. కానీ నా ఆత్మ నిర్దేశించింది కాదు. ఈ విధంగా వాళ్ళు పాపానికి పాపాన్ని జోడిస్తారు.


ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినబడింది.


నీ నీతి ఎలాంటిదో నేనే వెల్లడిచేస్తాను. వాటివలన నీకేమీ ప్రయోజనం ఉండదు.


మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు. మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.


మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి. మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం.


ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది. దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి.


అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,


బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది. వాళ్ళలో గానీ, వాళ్ళ మూకలో గానీ ఎవరూ మిగలరు. వాళ్ళ సంపదలో గానీ, వాళ్ళ ప్రాముఖ్యతలో గానీ ఏదీ మిగలదు.


తీర్పుని బట్టి దేశం రక్తంతోనూ, పట్టణం హింసతోనూ నిండిపోయింది. అందుకే సంకెళ్ళు సిద్ధం చేయండి.


ఆయన నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల, యూదా ప్రజల అతిక్రమాలు చాలా అధికమయ్యాయి. వాళ్ళు యెహోవా మనలను విడిచి పెట్టాడనీ, యెహోవా మనలను చూడటం లేదనీ చెప్పుకుంటున్నారు. కాబట్టి దేశం రక్త పాతంతోనూ పట్టణం భ్రష్టత్వంతోనూ నిండి పోయాయి.


సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” యెహోవా ప్రకటించేది ఇదే. వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, నాశనం దాచుకున్నారు.


విపత్తు రోజు దూరంగా ఉందనుకుని దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు.


ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు. యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు.


ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. అక్కడి ప్రజలు అబద్దికులు. వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.


ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపే వారిని ఆ దినాన నేను శిక్షిస్తాను.”


తిరుగుబాటు పట్టణానికి బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది.


ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ