Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 5:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి. దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను. దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ పొలంలో ఎవ్వరూ పని చేయరు. కలుపు మొక్కలు, ముళ్లపొదలు అక్కడ పెరుగుతాయి. ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 5:6
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.


వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,


గోదుమల బదులు ముళ్లు, బార్లీకి బదులు కలుపు మొలచు గాక. యోబు మాటలు ఇంతటితో సమాప్తం.


ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.


పట్టణంలో శైథిల్యం మాత్రం మిగిలింది. గుమ్మాలు విరిగి పోయాయి.


నువ్వు విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు దానికి కావలసిన వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. భూసారమైన ఆహారాన్ని విస్తారంగా నీకిస్తాడు. నీ పంటలు విస్తారంగా పండుతాయి. ఆ రోజున నీ పశువులు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేస్తాయి.


మరో సంవత్సరం, కొద్ది రోజులకి మీ నమ్మకం వీగిపోతుంది. నిశ్చింతగా ఉన్న స్త్రీలూ, ద్రాక్షపంట నష్టమౌతుంది. ద్రాక్షపళ్ళు ఇంటికి రావు.


నువ్వు పాడైపోయి నిర్జనంగా ఉన్నా నీ దేశం నాశనమైపోయినా ఇప్పుడు నీ నివాసులకు నీ భూమి ఇరుకుగా ఉంది. నిన్ను మింగివేసినవారు దూరంగా ఉంటారు.


ముళ్ళచెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండిచెట్లకు బదులు గొంజి వృక్షాలు పెరుగుతాయి. ఆ విషయం యెహోవాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.”


అవన్నీ వచ్చి మెట్టల్లో లోయల్లో బండల సందుల్లో ముళ్ళ పొదలన్నిటిలో గడ్డి బీడులన్నిటిలో దిగి ఉండిపోతాయి.


కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు,


ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము.


ఈ దేశమంతా పాడైపోతుంది. శిథిలమైపోతుంది. ఈ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తారు.


నువ్వు అతనికి ఈ విధంగా చెప్పాలి. ‘యెహోవా ఈ మాట చెప్తున్నాడు. చూడు, నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తున్నాను. నేను నాటిన దాన్ని నేనే పెకలించి వేస్తున్నాను. భూమి అంతటా ఇదే జరుగుతుంది.


ఒక తోట మీద దాడి చేసినట్టు ఆయన తన గుడారం మీద దాడి చేశాడు. సమాజ పవిత్ర ప్రాంగణాన్ని నాశనం చేశాడు. ఆరాధన సమావేశం, విశ్రాంతి దినం సీయోనులో మరుపుకు వచ్చేలా యెహోవా చేశాడు. కోపావేశంలో ఆయన రాజూ యాజకుడూ ఇద్దరినీ తోసిపుచ్చాడు.


ఎందుకంటే, ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా అధిపతి లేకుండా బలి అర్పించకుండా ఉంటారు. దేవతా స్తంభాన్ని గాని ఏఫోదును గాని గృహ దేవుళ్ళను గాని ఉంచుకోరు.


చూడండి, వారు నాశనం తప్పించుకుంటే. ఐగుప్తుదేశం వారికి పోగయ్యే స్థలంగా ఉంటుంది. మెంఫిస్ పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉంటుంది. వారి అపురూపమైన వెండివస్తువులను దురదగొండి మొక్కలు ఆవరిస్తాయి. ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగుతుంది.


అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. దాని బెరడు ఒలిచి పారేశాడు. వాటి కొమ్మలు తెల్లబారాయి.


కోతకాలానికి మూడు నెలలు ముందే వానలేకుండా చేశాను. ఒక పట్టణం మీద వాన కురిపించి మరొక పట్టణం మీద కురిపించలేదు. ఒక చోట వాన పడింది, వాన పడని పొలం ఎండిపోయింది.


వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.


యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి,


తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలచుకున్నపుడల్లా నీటిని రక్తంగా చేయడానికీ అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికీ వారికి అధికారం ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ