Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 47:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు, వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 ‘నేను శాశ్వతంగా జీవిస్తాను. శాశ్వతంగా నేను రాణిగానే ఉంటాను’ అని నీవు చెప్పావు. నీవు ఆ ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు గమనించలేదు. ఏమి జరుగుతుందో అని నీవు గమనించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 47:7
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు.


దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు. అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు.


కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో. రాజ్యాలన్నిటికీ రాణి అని ప్రజలు ఇంక నిన్ను పిలవరు.


నీతిమంతులు చనిపోతున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. నిబంధన ప్రజలు చనిపోతున్నారు గానీ ఎవరికీ అర్థం కావడం లేదు. కీడు చూడకుండా నీతిమంతులను తీసివేయడం జరుగుతూ ఉంది.


ఎవరికి జడిసి, భయపడి అంత మోసం చేశావు? నా గురించి ఆలోచించలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. చాలా కాలం నేను మౌనంగా లేను గదా! అయితే నువ్వు నన్నంతగా పట్టించుకోలేదు.


ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు. అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?


దాని చెంగులకు మురికి అంటింది. దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు. అది ఎంతో వింతగా పతనం అయ్యింది. దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు. యెహోవా, నాకు కలిగిన బాధ చూడు. శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు!


నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.


ఐగుప్తు రాజు ఫరో, నైలునదిలో పడుకున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని. నైలునది నాది, నేనే దాన్ని కలగచేశాను, అని నువ్వు చెప్పుకుంటున్నావు.


“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు. అంతం! ఇశ్రాయేలు దేశం నాలుగు సరిహద్దులకు అంతం వచ్చేసింది.


ఒక సంవత్సర కాలం గడచిన తరువాత అతడు తన రాజధాని పట్టణం బబులోనులోని ఒక నగరంలో సంచరించాడు.


నెబుకద్నెజరు అనే నేను నా నగరంలో క్షేమంగా, నా ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక రాత్రి నాకు భయంకరమైన కల వచ్చింది.


వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే,


ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను” అనుకుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ