Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 42:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు ఎక్కువ గుడ్డివాడు. నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటివాడు. నేను ఒడంబడిక చేసుకొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపిన దూత కాకుండా మరి ఎవడు చెవిటివాడు? నాతో నిబంధన ఉన్నవాని కన్నా ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపిన దూత కాకుండా మరి ఎవడు చెవిటివాడు? నాతో నిబంధన ఉన్నవాని కన్నా ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 42:19
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.


ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు నా సంరక్షణలోకి రావాలి. నాతో సంధి చేసుకోవాలి. వాళ్ళు నాతో సంధి చేసుకోవాలి.


ఆ రోజున చెవిటి వాళ్ళు గ్రంథంలోని వాక్యాలు వింటారు. గుడ్డి వారు చిమ్మచీకట్లో కూడా చూస్తారు.


నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,


కళ్ళుండీ గుడ్డివారుగా, చెవులుండీ చెవిటివారుగా ఉన్న వారిని తీసుకురండి


నా సేవకుని మాటలను స్థిరపరిచే వాణ్ణీ, నా సందేశకుల ఆలోచనలు నెరవేర్చే వాణ్ణీ నేనే. యెరూషలేములో ప్రజలు నివసిస్తారనీ యూదా పట్టణాలను తిరిగి కడతారనీ నేను ఆజ్ఞాపించాను. దాని పాడైన స్థలాలను బాగు చేసేవాణ్ణి నేనే.


వారి కాపలాదారులంతా గుడ్డివాళ్ళు. వాళ్ళంతా తెలివితక్కువ వాళ్ళు. వాళ్ళంతా మొరగలేని మూగకుక్కలు. పడుకుని కలలు కంటారు. నిద్ర అంటే వారికి చాలా ఇష్టం.


ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు. ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.


నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.


మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు.


“నరపుత్రుడా, నువ్వు తిరగబడే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లకు కళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు. వాళ్లకి చెవులు ఉన్నాయి. కానీ వినరు.


ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.


“ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.”


అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు.


అందుకు యేసు, “మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ ‘మాకు చూపు ఉంది’ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పాడు.


సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి.


దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ