Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 4:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆ మహిమ పగలు ఎండకు నీడగానూ, గాలివానకు ఆశ్రయంగానూ, పైకప్పుగానూ ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఆ కాపుదల ఒక భద్రతా స్థలం. ఆ కాపుదల సూర్యుని వేడినుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు ఆ కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 4:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు.


పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను.


సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.


యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.


ఆ దేశ వార్తాహరుడికి ఇవ్వాల్సిన జవాబేది? యెహోవా సీయోనును స్థాపించాడు. ఆయన ప్రజల్లో బాధకు గురైన వాళ్లకు దానిలో ఆశ్రయం దొరుకుతుంది.”


ఎందుకంటే దరిద్రులకు నీవు భద్రతగాను, అవసరతలో ఉన్నవారికి సంరక్షకునిగానూ ఉన్నావు. గాలివానలో ఆశ్రయంగాను వేసవిలో నీడగానూ ఉన్నావు. నిర్దయుల ఊపిరి సెగలాగా గోడకి తగులుతున్న తుఫానులాగా ఉంటే నీవు కవచంగా ఉన్నావు.


యెహోవా తన స్వరంలోని వైభవాన్ని వినిపిస్తాడు. ప్రభావంగల స్వరం వినిపిస్తాడు. ప్రచండమైన కోపంతోను దహించే జ్వాలతోను తుఫాను వంటి తన ఉగ్రతలో, అగ్ని జ్వాలల్లో, భీకరమైన సుడిగాలితో, గాలి వానతో, వడగళ్ళతో తన చేతి కదలికను చూపిస్తాడు.


ఇదిగో, వినండి! ఒక రాజు నీతిమంతంగా రాజ్య పరిపాలన చేస్తాడు. అధిపతులు న్యాయసమ్మతంగా ఏలుబడి చేస్తారు.


వాళ్ళల్లో ప్రతి ఒక్కడూ గాలి విసిరినప్పుడు ఆశ్రయంలాగా, తుఫానులో అభయమిచ్చే స్థలంలాగా ఉంటాడు. ఎడారిలో జలధారల్లా, అలసి సొలసిన దేశంలో నీడనిచ్చే గొప్ప రాతి బండలాగా ఉంటాడు.


అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అయితే ఆయన ఇశ్రాయేలు రెండు కుటుంబాలకు తొట్రుపడజేసే రాయిగా తూలి పడేసే బండగా ఉంటాడు. యెరూషలేము నివాసులకు బోనుగా చిక్కుకునే వలగా ఉంటాడు.


కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను”


విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటివరకూ తాను చూడని సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్య భావంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు.


అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు.


వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ