Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 32:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 రాజ భవనాన్ని విడిచి పెట్టేస్తారు. జనసమ్మర్దమైన పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. కొండ, నిఘా గోపురాలు ఇక ఎప్పటికీ గుహల్లా ఉంటాయి. అవి అడవి గాడిదలు ఆనందించే స్థలంగానూ, పశువులు మేసే స్థలంగానూ ఉంటాయి. దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ ఇలా జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14-15 నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ లుగా ఉండును అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివసిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివసిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 కోట విడిచిపెట్టబడుతుంది కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది; కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా, మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 కోట విడిచిపెట్టబడుతుంది కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది; కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా, మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 32:14
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు.


దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తయిన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు.


ఓపెలులో నివసించే దేవాలయ సేవకులు తూర్పున నీటి ద్వారం పక్కన, గోపురం దగ్గర బాగు చేశారు.


అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి.


సందడితో నిండి పోయి కేకలు వేస్తున్న పట్టణమా! వేడుకల్లో మునిగిపోయిన నగరమా! నీలో చనిపోయిన వాళ్ళు కత్తి వల్ల హతం కాలేదు. వాళ్ళు యుద్ధంలో చనిపోలేదు.


అల్లకల్లోలమైన పట్టణం నిర్మూలమై పోయింది. ఎవరూ ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూతబడింది.


పట్టణంలో శైథిల్యం మాత్రం మిగిలింది. గుమ్మాలు విరిగి పోయాయి.


నీవు శత్రువుల నగరాన్ని దిబ్బగా చేశావు. ప్రాకారాలున్న పట్టణాన్ని శిథిలంగా చేశావు. అన్యుల కోటను పట్టణంగా మళ్ళీ ఉండకుండా చేశావు. అది మళ్ళీ ఎప్పుడూ నిర్మాణం కాకుండా చేశావు.


అలాగే ప్రాకారాలున్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. నివాస స్థలాలు మనుషులు లేని అరణ్యాల్లా మారతాయి. అక్కడ దూడలు మేస్తాయి. అవి అక్కడే పడుకుని చెట్ల కొమ్మలను తింటాయి.


యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.


నేను చెవులారా వినేలా సేనల ప్రభువు యెహోవా స్పష్టంగా ఈ మాట నాకు చెప్పాడు. నిజంగా గొప్పవి, అందమైన చాలా ఇళ్ళు వాటిలో నివాసముండే వారు లేక పాడైపోతాయి.


“ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,


ఆ దినాన వెయ్యి వెండి నాణేల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లు ఉండే ప్రతి స్థలంలో ముళ్ళతుప్పలు, బ్రహ్మజెముడు చెట్లు పెరుగుతాయి.


అడవి గాడిదలు చెట్లులేని మెట్టల మీద నిలబడి నక్కల్లాగా రొప్పుతున్నాయి. మేత లేక వాటి కళ్ళు పీక్కుపోతున్నాయి.”


ముట్టడి దిబ్బల వలనా, ఖడ్గం వలనా నాశనమైన పట్టణంలోని యూదా రాజుల గృహాల విషయంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు.


బబులోను రాజు హమాతు దేశంలోని రిబ్లాలో వాళ్ళని కొట్టి చంపించాడు. మిగిలిన యూదా వాళ్ళను బందీలుగా బబులోనుకు తీసుకు వెళ్ళాడు.


కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం.


లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను. ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను. ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను. దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను.


కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.


“నాలాంటి పట్టణం మరొకటి లేదని మురిసి పోతూ ఉత్సాహ పడుతూ నిశ్చింతగా ఉండిన పట్టణం ఇదే. అయ్యో, అది పాడైపోయింది. అడవి జంతువులు పడుకునే ఉనికిపట్టు అయింది.” అని దారిన పోయేవారంతా చెప్పుకుంటూ, ఈసడింపుగా దాని వైపు చెయ్యి ఆడిస్తారు.


తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది. వారు అక్కడ తమ మందలు మేపుతారు. చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు.


యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.


వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ