Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 28:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి వెనక్కి పడి, కుంగిపోయి, వలలో చిక్కుకుని, బందీలు అయ్యేలా యెహోవా మాట వాళ్లకి ఇలా వస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 గతంలో దేవుడు ఆ ప్రజలతో మాట్లాడి “ఇదిగో విశ్రాంతి స్థలం, ఇదే శాంతి స్థలం. అలసిపోయిన మనుష్యులు వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఇదే శాంతి స్థలం” అని చెప్పాడు. కానీ ప్రజలు దేవుని మాట వినిపించుకోలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 గతంలో ఆయన వారితో, “ఇది విశ్రాంతి స్థలం, అలసిపోయినవారిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇది నెమ్మది దొరికే స్థలం” అని చెప్పారు కాని వారు వినలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 గతంలో ఆయన వారితో, “ఇది విశ్రాంతి స్థలం, అలసిపోయినవారిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇది నెమ్మది దొరికే స్థలం” అని చెప్పారు కాని వారు వినలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 28:12
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి “యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రులను నీ మీద జయం పొందనీయకు” అని ప్రార్థించాడు.


ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.


ఒకవేళ చదువు లేనివాడికి పుస్తకాన్ని ఇచ్చి “చదువు” అంటే అతడు “నేను చదవలేను” అంటాడు.


ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది.” కానీ దానికి మీరు ఒప్పుకోలేదు.


నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.


నా ప్రజలు శాంతిభరితమైన చోట, సురక్షితమైన ఇళ్ళల్లో నివసిస్తారు.


వాళ్ళిలా అన్నారు. “యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం.


యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి. “ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?” అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు “మేము అందులో నడవం” అని చెబుతున్నారు.


అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు.


వారు ఎరుగని అన్య జనుల్లోకి నేను వారిని చెదరగొడతాను. వారు తమ దేశాన్ని విడిచిన తరువాత అందులో ఎవరూ సంచరించకుండా అది పాడైపోతుంది. ఈ విధంగా వారు మనోహరమైన తమ దేశానికి నాశనం తెచ్చి పెట్టుకున్నారు.”


మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ