Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 26:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 వాళ్ళు చనిపోయారు. వాళ్ళిక మళ్ళీ బతకరు. వాళ్ళు మరణమయ్యారు. వాళ్ళిక తిరిగి లేవరు. నువ్వు తీర్పు తీర్చడానికి వచ్చి వాళ్ళని నిజంగా అంతం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలన్నిటినీ తుడిచి పెట్టేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు. మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 వారు చనిపోయారు, మరల బ్రతకరు; వారి ఆత్మలు లేవవు. మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 వారు చనిపోయారు, మరల బ్రతకరు; వారి ఆత్మలు లేవవు. మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 26:14
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.


వారిని కన్న గర్భమే వారిని మరిచి పోతుంది. పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది. వారు మరి ఎన్నడూ జ్ఞాపకంలోకి రారు. చెట్టు విరిగి పడిపోయినట్టు దుర్మార్గులు పడిపోతారు.


మేఘాలు చెదిరిపోయి మాయమైపోయిన విధంగా పాతాళానికి దిగిపోయిన వాడు మళ్లీ పైకి రాడు.


వారు బయల్పెయోరును హత్తుకుని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు.


వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక.


వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు.


అదుగో పాపం చేసే వాళ్ళు అక్కడే పడిపోయారు. ఇక లేచే సామర్ధ్యం లేకుండా కూలిపోయారు.


సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.


తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి.


ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు.


నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.


బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.


తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?


మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి! ఉదయంలో కురిసే మంచులా నీ కాంతి ప్రకాశమానమై కురిసినప్పుడు భూమి తాను ఎరగా పట్టుకున్న తనలోని విగత జీవులను సజీవంగా అప్పగిస్తుంది.


నిన్ను సేనల ప్రభువైన యెహోవా శిక్షిస్తాడు. ఉరుములతో, భూకంపాలతో, భీకర శబ్దాలతో, సుడిగాలి తుఫానులతో, దహించే అగ్నిజ్వాలలతో ఆయన నిన్ను శిక్షిస్తాడు.


ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైనవారు కారు. చెక్కతో రాళ్ళతో మనుషులు చేసిన వారు కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు.


వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా? బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి?


“లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు.


అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.


ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ