Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 22:11 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 పాత కోనేటి నీళ్ళ కోసం రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని నిర్మించారు. కానీ పట్టణాన్ని నిర్మించిన వాణ్ణి మీరు పట్టించుకోలేదు. ఏనాడో దాని కోసం ఆలోచించిన వాణ్ణి మీరు లక్ష్యం చేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచినవారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 పాత కొలనులో నీటి కోసం మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 పాత కొలనులో నీటి కోసం మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 22:11
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.


కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గంలో పారిపోయారు.


ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమునూ, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదునూ ఎన్నుకున్నాను’ అని చెప్పాడు.


దాని పక్కన ఉన్న బేత్సూరులో సగ భాగాన్ని అధికారి అజ్బూకు కొడుకు నెహెమ్యా బాగు చేశాడు. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకూ కట్టి ఉన్న కోనేరు వరకూ, యుద్ధవీరుల ఇళ్ళ వరకూ కట్టాడు.


ఆ రోజుల్లో మనుషులు తమ సృష్టికర్త వైపు చూస్తారు. ఇశ్రాయేలు ప్రజల పరిశుద్ధ దేవునిపై తమ దృష్టి నిలుపుతారు.


మీరు యెరూషలేములోని ఇళ్ళను లెక్కపెట్టారు. ప్రాకారాన్ని బలపరచడానికై మీరు ఇళ్ళు పడగొట్టారు.


“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ, అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ!


అయితే దీన్ని నేనే ఎప్పుడో నిర్ణయించాననీ, పూర్వకాలంలోనే దీన్ని ఏర్పాటు చేశాననీ నీకు వినబడలేదా? నువ్వు ప్రాకారాలు గల పట్టణాలను పాడుదిబ్బలుగా చేయడం నా వల్లనే జరిగింది.


అప్పుడు యెహోవా యెషయాతో ఇలా చెప్పాడు. ఆహాజుకు ఎదురు వెళ్ళు. నీవు, నీ కుమారుడు షెయార్యాషూబు చాకిరేవు దారిలో ఎగువ కోనేటి కాలవ దగ్గరికి వెళ్ళండి.


యాకోబు వంశానికి తన ముఖం దాచుకున్న యెహోవా కోసం నేను ఎదురు చూస్తాను. ఆయన కోసం నేను ఎదురు చూస్తాను.


యూదుల రాజైన సిద్కియా, అతని యోధులందరూ వాళ్ళను చూసి పారిపోయారు. వాళ్ళు రాత్రిపూట రాజు తోట మార్గంలో రెండు గోడల మధ్య ఉన్న గుమ్మపు దారిలో నుంచి పట్టణం బయటకు వెళ్ళిపోయారు. రాజు అరాబా మైదానం వైపుగా వెళ్ళాడు.


అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను. రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. నా దేవుడు నా మాట వింటాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ