Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 2:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు. అనేక జాతులకు తీర్పు తీరుస్తాడు. వాళ్ళు తమ కత్తులను నాగటి నక్కులుగానూ, తమ ఈటెలను మోట కత్తులుగానూ సాగగొడతారు. జనం మీదకి జనం కత్తి ఎత్తరు. ఇంక ఎన్నడూ యుద్ధ సన్నాహాలు చెయ్యరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చునువారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు. అనేకుల వాదాలను దేవుడు అంతం చేస్తాడు. ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు. వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు. వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు. ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు. ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 2:4
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు.


నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.


భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను కాల్చి వేస్తాడు.


దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.


లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.


నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.


నా ప్రజలు శాంతిభరితమైన చోట, సురక్షితమైన ఇళ్ళల్లో నివసిస్తారు.


ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.


ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు. ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు.


నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు. ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు.


యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి.


ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.


“ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.


యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.


మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి.


రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. చుట్టు పక్కలుండే రాజ్యాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.


ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ కత్తులను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.


నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు.


ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”


తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.


యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ