Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 2:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అనేక మంది వచ్చి ఇలా అంటారు. “ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు, ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా, యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.” ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి –యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 అనేకమంది ప్రజలు అక్కడికి వెళ్తారు. “మనం యెహోవా పర్వతానికి వెళ్దాం. యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి. అప్పుడు యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు. మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు. దేవుని ఉపదేశాలు, యెహోవా సందేశం యెరూషలేములో, సీయోను కొండమీద ప్రారంభమై, ప్రపంచం అంతటికీ వ్యాపిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 2:3
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదులు ఈ రెండు రోజులను గూర్చి ఆజ్ఞ అందినట్టే ఏటేటా నియమించిన రోజుల్లో ఉత్సవం చేసుకుంటామని ఒప్పందం చేసుకున్నారు. ఈ పండగ రోజులను తరతరాలు ప్రతి కుటుంబంలో ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో జ్ఞాపకార్థంగా ఆచరిస్తామని నిశ్చయించుకున్నారు.


ఆయన నా యవ్వనంలో నా బలం తీసేశాడు. నా రోజులు తగ్గించేసాడు.


యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.


నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.


పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను.


మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.


మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను. ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను. అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.”


ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.


ఆ రోజున ఐగుప్తు దేశం నుండి అష్షూరు దేశానికి ఒక రాజ మార్గం ఉంటుంది. అష్షూరు ప్రజలు ఐగుప్తుకీ, ఐగుప్తు ప్రజలు అష్షూరుకీ వస్తూ పోతూ ఉంటారు. ఐగుప్తు ప్రజలు అష్షూరు ప్రజలతో కలసి యెహోవాను ఆరాధిస్తారు.


వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?


ఒకడు, ‘నేను యెహోవా వాణ్ణి’ అంటాడు, ఇంకొకడు యాకోబు పేరు చెబుతాడు. మరొకడు అయితే ‘యెహోవా వాణ్ణి’ అని తన చేతిపై రాసుకుని ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు.”


నా ఇంట్లో, నా ప్రాకారాల్లో ఒక భాగాన్ని వారికిస్తాను. కొడుకులకంటే కూతుళ్లకంటే మంచి పేరు ప్రతిష్టలు ప్రసాదిస్తాను. వాటిని ఎన్నటికీ కొట్టివేయడం జరగదు.


నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి. నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది.


రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు.


అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు.


అన్ని రాజ్యాల్లో నుంచి మీ సోదరులందరినీ యెహోవాకు అర్పణగా వాళ్ళు తీసుకు వస్తారు. వారిని గుర్రాల మీద రథాల మీద బండ్ల మీద కంచర గాడిదల మీద ఒంటెల మీద ఎక్కించి యెరూషలేములోని నా పవిత్ర పర్వతానికి వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యాన్ని యెహోవా మందిరంలోకి తెస్తారు.


వారు “బయలు తోడు” అని ప్రమాణం చేయడం నా ప్రజలకు నేర్పారు. ఇప్పుడు వారు “యెహోవా జీవం తోడు” అని నా పేరున ప్రమాణం చేయడానికి నా ప్రజల విధానాలను జాగ్రత్తగా నేర్చుకుంటే వారు నా ప్రజల మధ్య అభివృద్ధి చెందుతారు.


“యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది.


ఎఫ్రాయిము పర్వతాల మీద కాపలావాళ్ళు మన దేవుడైన యెహోవా దగ్గరికి, సీయోనుకు ఎక్కి వెళ్దాం రండి’ అని ప్రకటించే రోజు ఒకటి రాబోతుంది.”


దేవుడు నన్ను తన దర్శనాలతో నింపి ఇశ్రాయేలు దేశంలోకి తెచ్చి, చాలా ఎత్తయిన కొండ మీద ఉంచాడు. దానికి దక్షిణాన పట్టణం లాంటిది ఒకటి నాకు కనబడింది.


తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు.


యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.


అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, “యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి.


“కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.


దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.


యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది.


మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది.


దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు.


“అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.


వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు రావడం మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశం అయ్యాము” అని చెప్పాడు. అందుకు పేతురు ఇలా అన్నాడు,


అయినా, నేను చెప్పేదేమంటే, “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరం భూలోకమంతటిలోకీ, వారి మాటలు భూదిగంతాలకు చేరాయి.”


వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. అక్కడ సరైన బలులు అర్పిస్తారు. వారు సముద్రాల సమృద్ధినీ సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు.


“మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ


కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ