Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 16:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 నిబంధనా నమ్మకత్వంతో సింహాసన స్థాపన జరుగుతుంది. దావీదు గుడారంలోనుంచి ఒకడు అక్కడ నమ్మకంగా కూర్చుంటాడు. అతడు తీర్పు తీరుస్తాడు, న్యాయం వెదకుతాడు, నీతి జరిగిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 అప్పుడు క్రొత్త రాజు వస్తాడు. ఈ రాజు దావీదు వంశంవాడు. ఆయన నిజాయితీ పరుడు. ఆయన ప్రేమ, దయగలవాడు. ఈ రాజు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. సరియైనవి, మంచివి ఆయన చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; దావీదు కుటుంబం నుండి సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని న్యాయంగా తీర్పు తీర్చుతూ నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; దావీదు కుటుంబం నుండి సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని న్యాయంగా తీర్పు తీర్చుతూ నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 16:5
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,


దావీదు ఆ పట్టణంలో కాపురం ఉన్నాడు. దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. మిల్లో దిగువన దావీదు ఒక కోట కట్టించాడు.


నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”


నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు.”


హిజ్కియా యూదా దేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యధార్థంగా నమ్మకం గా ప్రవర్తించాడు.


నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి.


నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.


లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.


లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.


రాజు బలశాలి. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. నువ్వు నీతి న్యాయాలను సుస్థిరం చేశావు, యాకోబు ప్రజల పట్ల నీతి పాలన స్థాపించావు.


కృప, సత్యం రాజుకు రక్ష. కృప మూలంగా అతడు తన సింహాసనాన్ని పదిలం చేసుకుంటాడు.


ఏ రాజు దరిద్రులకు సత్యంతో న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం శాశ్వతంగా ఉంటుంది.


ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.


ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.”


సకల ప్రజలు, రాష్ట్రాలు, వివిధ భాషలు మాటలాడేవారు ఆయన్ని సేవించేలా ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు.


ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం, మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి. ఆయన రాజ్యం నిత్యం నిలిచేది. అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు. ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.


పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను. ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.


కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని బలమైన ప్రజగా చేస్తాను. యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి ఎప్పటికీ వారిని పాలిస్తాను.


సీయోను నివాసులారా, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ