యెషయా 14:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను హతం చేశావు. వాళ్ళతో పాటు నువ్వు సమాధిలో ఉండవు. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకానికి రాదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 ఇంకా ఎంతోమంది రాజులు చనిపోయారు. వారందరికీ వారి సమాధులు ఉన్నాయి. కానీ నీవు వాళ్లను చేరవు. ఎందుకంటే, నీవు నీ స్వంత దేశాన్ని నాశనం చేశావు గనుక నీ స్వంత ప్రజల్నే నీవు చంపేశావు. నీవు చేసినట్టు నీ పిల్లలు నాశనం చేయటం కొనసాగించరు. నీ పిల్లలు ఆపుజేయబడతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను చంపేశావు కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు. దుర్మార్గుని సంతానం ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను చంపేశావు కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు. దుర్మార్గుని సంతానం ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు. အခန်းကိုကြည့်ပါ။ |
వాళ్ళందరూ భక్తిహీనులు, దుర్మార్గులు. ప్రతి నోరు మూర్ఖపు మాటలు మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువు వాళ్ళ యువకులను చూసి సంతోషించడు, వాళ్ళల్లో తల్లిదండ్రులు లేని వారి పట్ల అయినా, వాళ్ళ వితంతువుల పట్ల అయినా కరుణ చూపించడు. దీనంతటి బట్టి ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.