Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 14:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఇతర జాతులు వాళ్ళను తమ సొంత దేశానికి తీసుకు పోతారు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వాళ్ళను దాసదాసీలుగా ఉపయోగించుకుంటారు. తమను బందీలుగా పట్టుకున్న వాళ్ళను వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు. తమను బాధించిన వాళ్ళ మీద పరిపాలన చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమునవారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురువారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి తమ్మును బాధించినవారిని ఏలుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఆ రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు దేశంలో చేర్చుకుంటారు. ఇతర రాజ్యాలకు చెందిన ఆ స్త్రీ పురుషులు ఇశ్రాయేలుకు బానిసలు అవుతారు. గతంలో ఆ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కాని ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాలను ఓడించి, వారి మీద ఏలుబడి చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ప్రజలు వారిని తీసుకువచ్చి వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు. ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు. వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని తమను బాధించిన వారిని పాలిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ప్రజలు వారిని తీసుకువచ్చి వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు. ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు. వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని తమను బాధించిన వారిని పాలిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 14:2
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.


నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.


ఆ రోజుల్లో నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజలు, చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేస్తూ ఆ బలమైన జనాలు, నదులతో నిండి ఉన్న వాళ్ళ దేశం నుండి సేనల ప్రభువు అయిన యెహోవాకు కానుకలు తీసుకుని వస్తారు. సేనల ప్రభువు అయిన యెహోవా నామాన్ని ధరించిన సీయోను పర్వతానికి తీసుకు వస్తారు.


అష్షూరు కత్తి మూలంగా కూలుతుంది. అయితే అది మనిషి ఝళిపించే కత్తి కాదు. అతడు ఆ కత్తిని ఎదుర్కోలేక పారిపోతాడు. అతని పిల్లలు బానిసలై బలవంతంగా కఠిన శ్రమ చేస్తారు.


యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు “ఐగుప్తీయుల సంపాదన, కూషు వ్యాపార లాభాలు, నీకు దొరుకుతాయి. ఎత్తుగా ఉండే సెబాయీయులు నీకు లొంగిపోతారు. వారు సంకెళ్ళతో నీవెంట వచ్చి నీకు సాగిలపడతారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన తప్ప మరి ఏ దేవుడూ లేడు’ అని చెబుతూ నిన్ను వేడుకుంటారు.”


ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను రాజ్యాల వైపు నా చెయ్యి ఎత్తుతాను. ప్రజలకు నా జెండాను సంకేతంగా ఎత్తుతాను. వాళ్ళు నీ కొడుకులను తమ చేతుల్లో తీసుకు వస్తారు. నీ కూతుళ్ళను తమ భుజాలమీద మోసుకువస్తారు.


రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.”


అయితే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నియంత దగ్గర నుంచి బందీలను విడిపించడం జరుగుతుంది. బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము తీసుకోవడం జరుగుతుంది. నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను.


ఎందుకంటే నువ్వు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం రాజ్యాలను స్వాధీనం చేసుకుంటుంది. పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.


నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించినవారంతా వచ్చి నీ పాదాల మీద పడతారు. యెహోవా పట్టణం అనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అనీ నీకు పేరు పెడతారు.


తలెత్తి చుట్టూ చూడు. వీళ్ళంతా మూకుమ్మడిగా నీ దగ్గరికి వస్తున్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తారు. నీ కూతుళ్ళు చంకనెక్కి వస్తున్నారు.


విదేశీయులు నిలబడి మీ మందలను మేపుతారు. విదేశీయుల పిల్లలు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పనిచేస్తారు.


యెహోవా ఇలా చెబుతున్నాడు, “నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను. రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను. మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు.


కాబట్టి, నిన్ను దిగమింగే వాళ్ళెవరో, వాళ్ళనే దిగమింగడం జరుగుతుంది. నీ ప్రత్యర్దులందరూ బందీలుగా చెరలోకి వెళ్తారు. నిన్ను దోచుకున్నవాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. నిన్ను కొల్లగొట్టిన వాళ్ళను కొల్లసొమ్ముగా చేస్తాను.


అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “రబ్బాకు వ్యతిరేకంగానూ, అమ్మోను ప్రజలకు వ్యతిరేకంగానూ నేను యుద్ధ భేరీని మోగించే రోజులు వస్తున్నాయి. దాంతో రబ్బా అంతా వదిలివేసిన గుట్టలా ఉంటుంది. దాని ఊళ్ళు తగలబడి పోతాయి. దాని వారసులను ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకుంటారు.


ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.


అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం చేస్తారు. వారు యుగయుగాంతాల వరకూ రాజ్యమేలుతారు.


మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను. వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు. యెహోవా ఈ మాట చెప్పాడు.


మీ చుట్టుపక్కల ఉన్న జాతుల్లోనించి దాస దాసీలను కొనుక్కోవచ్చు.


అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.


సమస్తమైన ప్రజలారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నాడు. ఆయన ఎదుట మౌనంగా నిలబడి ఉండండి.


నేను ఆ ప్రజలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారిని వారి దాసులు దోచుకుంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపించాడని మీరు తెలుసుకుంటారు.


అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండడం చేస్తే


అవును, వీరు చాలా ఇష్టంగా ఆ పని చేశారు. నిజానికి వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో భాగం పంచుకున్నారు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో వారికి సహాయం చేయడం సబబే.


వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.


సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.


దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది.


సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ