యెషయా 14:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 కానీ నువ్వు పారేసిన కొమ్మలా ఉన్నావు. కత్తివాత చచ్చిన శవాలు నిన్ను కప్పుతున్నాయి. అగాధంలో ఉన్న రాళ్ళ దగ్గరికి దిగిపోయిన వాళ్ళ శవాలు నిన్ను కప్పుతున్నాయి. నువ్వు తొక్కేసిన పీనుగులా అయ్యావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్ప బడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె నున్నావు အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 అయితే నీవు, దుష్ట రాజువి నీ సమాధిలోనుండి త్రోసి వేయబడ్డావు. నరకబడిన చెట్టు కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పారవేయబడింది. నీవు యుద్ధంలో చచ్చిపడిన వానిలా ఉన్నావు. మిగతా సైనికులు వాని మీద నడిచారు. ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు. నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా నీ సమాధి నుండి పారవేయబడ్డావు. నీవు చంపబడినవారితో కత్తితో పొడవబడిన వారితో పాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు. కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా నీ సమాధి నుండి పారవేయబడ్డావు. నీవు చంపబడినవారితో కత్తితో పొడవబడిన వారితో పాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు. కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు. အခန်းကိုကြည့်ပါ။ |