Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 14:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 ఓ ప్రకాశవంతమైన నక్షత్రమా! ఉదయ పుత్రా! నీవు ఆకాశంనుండి ఎలా పడిపోయావు.? జనాంగాన్ని పతనం చేసే నీవు భూమి మీదికి ఎలా నరికి వేయబడ్డావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెలా ఆకాశం నుండి పడ్డావు? దేశాలను పడగొట్టిన నీవు భూమి మీద ఎలా పడవేయబడ్డావు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెలా ఆకాశం నుండి పడ్డావు? దేశాలను పడగొట్టిన నీవు భూమి మీద ఎలా పడవేయబడ్డావు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 14:12
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు.


ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది. ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి వాడిన ఆకులు రాలినట్టు దాని నక్షత్రాలన్నీ రాలిపోతాయి.


అన్ని దేశాలనూ అణగ గొట్టే సుత్తి ఎలా విరిగి పోయిందో చూడండి. దేశాల మధ్య బబులోను ఎలా ఒక భయానక దృశ్యంలా ఉందో చూడండి


బబులోను తన ఎత్తయిన కోటలను ఎంత బలోపేతం చేసినా, వాళ్ళ కోటలు ఆకాశంలోకి కట్టుకున్నా వినాశకులు నానుండి ఆమె దగ్గరికి వస్తారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.


ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.


వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు. నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు! పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం-ఇప్పుడు సముద్రం పాలయింది. నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు. నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం.


గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు.


అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను.


ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు.


పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు.


తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను.


యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.


మూడవ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడవ భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది.


ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిపై పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ