హోషేయ 4:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను. మీ కోడళ్ళ వ్యభిచారాన్ని బట్టి నేను వారిని శిక్షించను. ఎందుకంటే ప్రజలు తామే వేశ్యల దగ్గరికి పోతారు. తామే ఆలయ వేశ్యలతో పోకిరీ పనులు చెయ్యడం కోసం బలులర్పిస్తారు. అవగాహన లేని జనం నిర్మూలమైపోతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యముచేయుచు బలులనర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటనుబట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూలమగును. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి, వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి, ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “మీ కుమార్తెలు వేశ్యలు అయినందుకు, నేను వారిని శిక్షించను, మీ కోడళ్ళు వ్యభిచారం చేసినందుకు, నేను వారిని శిక్షించను ఎందుకంటే, మనుష్యులు వ్యభిచారిణులుతో పోతారు, క్షేత్ర వ్యభిచారులతో పాటు బలులు అర్పిస్తారు, గ్రహింపు లేని ప్రజలు నాశనమవుతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “మీ కుమార్తెలు వేశ్యలు అయినందుకు, నేను వారిని శిక్షించను, మీ కోడళ్ళు వ్యభిచారం చేసినందుకు, నేను వారిని శిక్షించను ఎందుకంటే, మనుష్యులు వ్యభిచారిణులుతో పోతారు, క్షేత్ర వ్యభిచారులతో పాటు బలులు అర్పిస్తారు, గ్రహింపు లేని ప్రజలు నాశనమవుతారు. အခန်းကိုကြည့်ပါ။ |