హోషేయ 12:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. తూర్పు గాలి వెంట పరిగెడుతున్నాడు. మానక అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. ప్రజలు అష్షూరీయులతో సంధి చేస్తారు. ఐగుప్తునకు ఒలీవనూనె పంపిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ధమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 “ఎఫ్రాయిమువాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా ‘గాలిని తరుముతున్నారు.’ వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |